
మంజ్రేకర్...వాగుడు కట్టిపెట్టు!
పొలార్డ్ ఆగ్రహావేశం
ముంబై: ఐపీఎల్‌లో తన ఆటను విమర్శించిన వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌పై ముంబై ఆటగాడు కీరన్ పొలార్డ్ విరుచుకుపడ్డాడు. మాటలు జాగ్రత్తగా వాడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో పొలార్డ్ ఔట్ అయిన సందర్భంలో... ఇన్నింగ్స్‌లో చివరి కొన్ని ఓవర్లకు మాత్రమే అతను పనికొస్తాడంటూ మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తూ పొలార్డ్ ‘నీ నోటి నుంచి సానుకూల మాటలు రావా. డబ్బులు ఇస్తారు కాబట్టి నీ నోటి దూలను కొనసాగించు. బుర్ర లేదని కూడా అన్నావు. మాటలు జాగ్రత్తగా వాడు. ఒక్కసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేం’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.