విండీస్‌తో తొలి టెస్టు తొలిరోజు ఆటలో టీమిండియాదే పైచేయి
India tour of West Indies, 2023: కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ గతేడాది జూన్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ పేసర్.. క్యాష్ రిచ్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. చిరుతలాంటి వేగంతో బంతులు సంధిస్తూ తనదైన శైలిలో రాణిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఉమ్రాన్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ప్రదర్శనతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్-2023లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 8 మ్యాచ్‌లలో కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు.
విండీస్‌తో టీ20 సిరీస్‌లో
అయినప్పటికీ వెస్టిండీస్ టీ20 సిరీస్ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కడం విశేషం. అయితే, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్‌లతో కూడిన పేస్ దళంలో భాగమైన ఈ కశ్మీరీ స్పీడ్‌స్టర్‌కు తుదిజట్టులో అవకాశం వస్తుందో లేదో చూడాలి!!
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణిస్తున్న ఉమ్రాన్‌ను టెస్టు జట్టుకు ఎప్పుడు ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు. ఉమ్రాన్‌ను ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్‌తో పోల్చిన మంజ్రేకర్.. టెస్టుల్లో అతడికి అవకాశం ఇస్తే చెలరేగిపోతాడని జోస్యం చెప్పాడు.
ఎక్స్ ఫ్యాక్టర్ కాగలడు
ఈ మేరకు.. ‘‘టెస్టు క్రికెట్ జట్టుకు ఉమ్రాన్‌ను తప్పకుండా ఎంపిక చేయాలి. మార్క్‌వుడ్ గంటకు 90 మైళ్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయగల సమర్థుడు. టెయిలెండర్లను ఎక్కువ సేపు క్రీజులో నిలవనివ్వడు. అదే అతడి స్పెషాలిటీ. ఉమ్రాన్ మాలిక్ విషయంలో పునరాలోచన చేయాలి. మార్క్‌వుడ్ మాదిరే వేగంతో బౌలింగ్ చేయగలడు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడికి అవకాశాలు ఇవ్వడం బాగానే ఉంది. అయితే, టెస్టుల్లోనూ ఆడిస్తే వైవిధ్యమైన పేస్‌తో టీమిండియా బౌలింగ్ విభాగంలో అతడు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారే అవకాశం ఉంది’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. జూలై 12 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆరంభమైంది. తొలి మ్యాచ్ తొలిరోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. ఇక ఆగష్టు 13నాటి ఐదో టీ20తో ఈ టూర్ ముగియనుంది.
చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే
Comments
Please login to add a commentAdd a comment