సంజయ్ మంజ్రేకర్
ఫామ్‌ను కొలమానంగా తీసుకుంటే మాత్రం తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టే ఫేవరెట్. కానీ టి20 క్రికెట్‌లో ఏదీ సులభం కాదు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో టాస్‌ది కీలక పాత్ర. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేయాలని భావిస్తుంది. కోట్లా పిచ్‌లో మొదటి ఇన్నింగ్స్ సమయంలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. రెండో ఇన్నింగ్స్ సమయంలో స్పిన్నర్లకు, పేసర్లకు కూడా ఎలాంటి సహకారం ఉండదు.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 17 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినా శ్రీలంక కోలుకోవడానికి కారణం కూడా ఇదే. భారత్‌లోని పిచ్‌ల మీద ఉపఖండ స్పిన్నర్ల తరహాలో శాంట్నర్, సోధి బౌలింగ్ చేస్తున్నారు. ఒకవేళ న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు స్పిన్నర్లు ఏమాత్రం ప్రభావం చూపలేరు. కేవలం స్పిన్నర్ల కారణంగానే న్యూజిలాండ్ టోర్నీలో అన్ని మ్యాచ్‌లూ గెలిచింది. ఇక ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు.
అందుకే న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ చేసి స్పిన్ ఆయుధంతోనే వీరిని ఆపాలి. న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా బలంగానే ఉన్నా, ఇంగ్లండ్ జట్టులో హిట్టర్స్ ఎక్కువగా ఉన్నారు. అన్ని పిచ్‌లకూ సరిపోయే బౌలింగ్ వనరులు ఉండటం న్యూజిలాండ్ బలం. ఈ అంశంలో ఇంగ్లండ్ బలహీనంగానే ఉంది. కాబట్టి కివీస్ మెరుగైన జట్టుగా కనిపిస్తున్నా... ఈ మ్యాచ్ ఫలితాన్ని టాస్ నిర్దేశిస్తుంది.
ఫలితాన్ని టాస్ నిర్దేశిస్తుంది
Published Wed, Mar 30 2016 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM
Advertisement