సంజయ్ మంజ్రేకర్(PC: Ravindrasinh jadeja Twitter )- జడేజా
Ravindra Jadeja- Sanjay Manjrekar: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌ను ఉద్దేశించి.. ‘‘నా ప్రియమైన మిత్రుడిని స్క్రీన్ మీద చూస్తున్నా’’ అంటూ జడ్డూ మంజ్రేకర్ ఫొటో షేర్ చేశాడు.
కాగా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి దూరమైన ఈ ఆల్‌రౌండర్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భాగంగా మంజ్రేకర్ మాట్లాడుతున్న దృశ్యాన్ని పంచుకున్న జడ్డూ అతడిని డియర్ ఫ్రెండ్ అని సంభోదించాడు.
ప్రియ మిత్రులుగా మారారా?!
ఇక ఇందుకు స్పందనగా.. ‘‘హహా.. నువ్వు త్వరగా మైదానంలో అడుగుపెడితే చూడాలని నీ ఈ ప్రియమిత్రుడు ఎదురుచూస్తున్నాడు’’ అంటూ మంజ్రేకర్ బదులిచ్చాడు. ట్విటర్‌లో వీరిద్దరి సంభాషణ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘‘వామ్మో.. ఒకప్పటి ‘శత్రువులు’ ఇప్పుడు మిత్రులుగా మారిపోయారా!? నీ రిప్లైతో జడ్డూ మనసు గెలిచేసుకున్నావన్న మాట’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
అప్పుడేమో అలా..
వన్డే వరల్డ్‌కప్-2019 సెమీ ఫైనల్ సందర్భంగా మంజ్రేకర్.. జడేజాను ఉద్దేశించి అరకొర ఆటగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు స్పందించిన జడ్డూ.. ‘‘నా కెరీర్‌లో ఇప్పటి వరకు నీకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాను. ఇంకా ఆడతాను’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ నడిచింది. అయితే, ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో జడేజా అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో.. అతడితో మాట్లాడేందుకు మంజ్రేకర్ వచ్చాడు.
మంజ్రేకర్‌ను చూసి జడ్డూ నవ్వగా.. జడ్డూ నాతో మాట్లాడం ఇష్టమేనా అని ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా మాట్లాడుతా అంటూ జడేజా నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి కూడా! తాజాగా జడేజా ట్వీట్‌తో మరోసారి వీరిద్దరు వార్తల్లోకి వచ్చారు.
ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీ జరుగుతున్న సమయంలో గాయపడిన జడేజా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. మరోవైపు.. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా వెన్నునొప్పి తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్-2022 ఆడే అవకాశాలు లేకుండా పోయాయి. ఇలా ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే.
చదవండి: T20 WC 2022 Prize Money: ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎంత లభిస్తుందంటే!
Ha ha… and your dear friend looking forward to seeing you on the field soon :) https://t.co/eMpZyZYsYU
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) September 30, 2022
Comments
Please login to add a commentAdd a comment