టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్లు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ లేని లోటు భారత జట్టులో స్పష్టంగా కన్పిస్తోంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందుతున్న వీరిద్దరూ.. ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే వన్డే ప్రపంచకప్‌కు పంత్, రాహుల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేయాలని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
అదే విధంగా ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడనున్న అన్నీ పరిమిత ఓవర్ల సిరీస్‌లో కిషన్‌కు అవకాశం ఇవ్వాలని అతడు సూచించాడు. కాగా కిషన్ ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లలో వికెట్ కీపర్‌గా కిషన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇటీవలే జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైనప్పటికి తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అతడి స్థానంలో శ్రీకర్ భరత్‌కు జట్టు మెనెజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. కానీ భరత్ మాత్రం తీవ్ర నిరాశ పరిచాడు.
ఈ నేపథ్యంలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. "ఇషాన్ కిషన్ అద్భుతమైన లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్. అతడికి ఓపెనర్‌గా వచ్చి విధ్వంసం సృష్టించే సత్తా ఉంది. అదే విధంగా లోయార్డర్‌లో కూడా ఆడగలడు. అటువంటి ఆటగాడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. పాపం కిషన్.. డబుల్ సెంచరీ సాధించిన తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.
మిగితా ఆటగాళ్లు ఫిట్‌నెస్ సాధించేంతవరకు రెగ్యూలర్‌గా కిషన్‌తో ముందుకుపోవాలి. రాహుల్ సాధరణంగా వన్డేల్లో ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. కిషన్‌ను కూడా ఆ స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాలి. రాహుల్ ఫిట్‌నెస్ సాధించేంతవరకు ఇషాన్ కిషన్ మంచి ఎంపిక అని" తన యూట్యూబ్ ఛానల్‌లో సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.
చదవండి: డబ్ల్యూటీసీ గాయాన్ని మళ్లీ రేపిన అశ్విన్! ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్‌పై విసుర్లు!
Comments
Please login to add a commentAdd a comment