
మంజ్రేకర్‌పై మండిపడ్డ పొలార్డ్
ముంబై: క్రికెట్‌లో కామెంటేటర్లు కామెంట్లతో అభిమానులను, ఆటగాళ్లను అలరిస్తారు. ఒక్కోసారి వారి చలోక్తులు కొందరికి నవ్వు తెప్పిస్తాయి. మరికొందరిని ఆగ్రహానికి గుర్తిచేస్తాయి. ఆదివారం జరిగిన ముంబై ఇండియన్స్, కొల్‌కత నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో కామెంటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు ముంబై ఆల్‌రౌండర్ పొలార్డ్ కు కోపం తెప్పించాయి.
పొలార్డ్ బ్యాటింగ్ చేస్తుండగా పొలార్డ్ ఇన్నింగ్స్ చివర్లోని ఐదు, ఆరు ఓవర్లు ఆడె బ్యాట్స్‌మన్. వెస్టిండీస్ ప్లేయర్ లిమిటెడ్ ఆటగాడని సంజయ్ వ్యాఖ్యానించాడు. పొలార్డ్ ఈ వ్యాఖ్యలపై ట్వీటర్ ద్వారా స్పందించాడు.‘ మీ నోటి నుంచి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారని భావిస్తున్నారా ? ఎందుకంటే మీరు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు. మీరు మాత్రం వర్బల్ డయేరియాతో మాటలు కొన సాగిస్తున్నారు. నా గురించి మీకు తెలుసా? మాటలు చాలా శక్తిమంతమైనవి, ఒకసారి నోరు జారితే మళ్లీ వెనక్కి తీసుకోలేము’ అని సూచిస్తూ ట్వీట్‌లతో మంజ్రేకర్ పై పోలార్డ్ ఆగ్రహాన్నివ్యక్తం చేశాడు.
Do you know how I get big so.. about BRAINLESS.. words are very powerful .. once it leaves u can't take it back.. sins of parents fall on...
— Kieron Pollard (@KieronPollard55) 9 April 2017