
న్యూఢిల్లీ: ఆసియాకప్‌లో భారత్ ప్రధాన పోటీదారుగా ఉన్నా.. టైటిల్ మాత్రం పాకిస్తాన్ గెలిచే అవకాశాలున్నాయని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. యూఏఈలో పాక్ తరచూ ఆడుతుండడం ఆ జట్టుకు అనుకూలించనుందని చెప్పాడు. ‘అనూహ్యంగా పుంజుకునే జట్లలో పాక్ ఒకటి. కానీ విరాట్ లేకపోవడంతో భారత్ బాగా బలహీన పడింది’ అని వివరించాడు.
విరాట్ కోహ్లి లేకపోతేనేం..
విరాట్ కోహ్లి లేకపోయినా టీమిండియా ఉత్తమ జట్టేనని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. దాయాది పాకిస్తాన్‌తో బుధవారం జరిగే ఆసియా కప్ సమరంలో కోహ్లి గైర్హాజరు భారత్‌పై పెద్దగా ప్రభావం చూపబోదని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లకు సమాన అవకాశాలున్నాయని చెప్పాడు. విరాట్ విశ్రాంతి తీసుకోవడంతో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘విరాట్ ఉన్నాడా లేడా అన్నది ముఖ్యం కాదు. అతడు లేకపోయినా భారత్ గట్టి జట్టే. ఆసియాకప్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ జట్టు టీమిండియా’ అని సౌరవ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment