తిలక్ వర్మ- శ్రేయస్ అయ్యర్ (PC: BCCI)
Asia Cup 2023- India Vs Pakistan: ఆసియా కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో యువ సంచలనం తిలక్ వర్మకు తుదిజట్టులో చోటివ్వాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌ను ఆడిస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా హైదారాబాదీ స్టార్ తిలక్ వర్మ టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
టాప్ స్కోరర్..
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొత్తంగా 173 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించిన తిలక్ వర్మ.. ఒక్క వన్డే కూడా ఆడకుండానే ఏకంగా ఆసియా కప్ వంటి మెగా ఈవెంట్ జట్టులో స్థానం సంపాదించాడు.
అందుకే తిలక్‌కు స్థానం
మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో లెఫ్టాండర్‌గా రాణించడం.. మిగతా వాళ్లతో పోలిస్తే తిలక్‌కు ఉన్న అదనపు అర్హతగా మారింది. ఈ నేపథ్యంలో అతడిని ఈ వన్డే టోర్నీకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా తెలిపాడు.
ఇదిలా ఉంటే.. శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో ఈ ఈవెంట్‌లో రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో పల్లెకెలె మ్యాచ్‌లో తిలక్ వర్మను తప్పక ఆడించాలంటూ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
లెఫ్టాండర్‌గా తిలక్.. జట్టుకు ప్రయోజనకరం
పాక్‌తో మ్యాచ్‌కు తన తుదిజట్టును ఎంచుకున్న సందర్భంగా.. ‘‘ నా జట్టులో ముగ్గురు సీమర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీకి చోటిస్తాను. నాలుగో సీమర్‌గా హార్దిక్ పాండ్యా ఉంటాడు. ఇక స్పిన్నర్లుగా జడేజా, కుల్దీప్ ఉండనే ఉన్నారు. నా ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మలకు అవకాశమిస్తాను.
నంబర్ 3లో విరాట్ కోహ్లి. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను తీసుకుంటాను.ఇక మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ లేదంటే తిలక్ వర్మలో ఒకరు. అయితే, వీరిద్దరిలో టీమిండియా మొదటి ప్రాధాన్యం తిలక్ వర్మకే ఉండాలంటాను. ఎందుకంటే.. టాప్-7 బ్యాటర్లలో హార్దిక్ పాండ్యాను కలుపుకొని అందరూ కుడిచేతి వాటం గల బ్యాటర్లే.
అదే ప్రధాన సమస్య
కాబట్టి లెఫ్టాండర్ అయిన తిలక్ వర్మను మిడిలార్డర్‌లో ఆడించాలి. అయితే, అతడిని ఏ స్థానంలో రప్పించాలి అనేదే టీమిండియాకు ఇప్పుడున్న సమస్య’’ అని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో చర్చలో సంజయ్ మంజ్రేకర్ జట్టు కూర్పుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా శ్రేయస్ అయ్యర్ ఇటీవలే గాయం నుంచి పూర్తిగా కోలుకుని పునరాగమనం చేయనున్నాడు.
అయితే, అతడు వంద శాతం ఫిట్‌గా ఉన్నాడని చెప్పినప్పటికీ మ్యాచ్ సమయానికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. కాబట్టి తిలక్ అరంగేట్రం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోయారు. కానీ, కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌గా లేడు కాబట్టి లెఫ్టాండర్ ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఒకవేళ అయ్యర్ ఉంటే.. తిలక్‌కు మొండిచేయి ఎదురుకావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఆసియా కప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్న జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/ తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
చదవండి: యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్ చేసిన కోహ్లి! స్కోరెంతంటే..
Comments
Please login to add a commentAdd a comment