సంజయ్ మంజ్రేకర్
ఐపీఎల్-2023.. ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లతో జట్టును గెలిపించిన ఘనత.. ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి 474 పరుగులతో సత్తా చాటి ‘నయా ఫినిషర్’గా బిరుదు.. అదే ఏడాది ఆగష్టులో టీమిండియా తరఫున అరంగేట్రం..
ఇప్పటికే ఆటగాడు ఎవరో అర్థమైపోయి ఉంటుంది కదా.. అవును.. రింకూ సింగ్. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున గతేడాది దంచికొట్టిన ఈ యూపీ లెఫ్టాండ్ బ్యాటర్.. సిక్సర్ల కింగ్‌గా పేరొందాడు. అదే జోష్‌లో టీమిండియా తలుపుతట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ఇప్పటి వరకు భారత్ తరఫున 15 టీ20లు, రెండు వన్డేలు ఆడిన రింకూ ఆయా ఫార్మాట్లలో వరుసగా 356, 55 పరుగులు సాధించాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ రాణించాడు. అయితే.. ఐపీఎల్-2024లో మాత్రం అతడికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు.
ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి రింకూ 83 పరుగులు చేశాడు. రెండుసార్లు అజేయంగా నిలిచాడు. అయితే.. అతడి స్ట్రైక్‌రేటు(162.75) మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘అతడికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు కాబట్టి.. సెలక్టర్లు రింకూ సింగ్ పేరును మర్చిపోరనే అనుకుంటున్నా. ఈ టోర్నీ తర్వాత అతడు నేరుగా టీమిండియాలో అడుగుపెట్టగల సత్తా కలిగిన వాడు.
నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకోవడం చూస్తున్నాం. టీమిండియా కీలక సభ్యుల్లో అతడూ ఒకడు. కొంతమంది స్టార్ల కంటే కూడా అద్భుతంగా ఆడగలిగినవాడు’’ అంటూ సంజయ్ మంజ్రేకర్.. టీ20 ప్రపంచకప్-2024 ఆడే భారత జట్టులో రింకూ సింగ్‌కు తప్పక చోటు కల్పించాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు.
కాగా మే 26న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ముగియనుండగా.. జూన్ 1 నుంచి వరల్డ్‌కప్ సమరం మొదలుకానుంది. పొట్టి ఫార్మాట్‌లో సాగే ఈవెంట్‌కు వెస్టిండీస్- అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో టీమిండియా ఈ ఐసీసీ టోర్నీలో తమ ప్రయాణం ఆరంభించనుంది.
చదవండి: హార్దిక్‌ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా! వైరల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment