Venkatesh Iyer Will Fetch 12 To 14 Crores In Next Year IPL Auction: వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ భారీ ధర పలికే అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. ప్రస్తుత సీజన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న అయ్యర్.. మరుసటి సీజన్ మెగా ఆక‌్షన్‌లో 12 నుంచి 14 కోట్ల ధర పలుకుతాడని అంచనా వేశాడు. తాజాగా ఓ ప్రముఖ క్రీడా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్ అయ్యర్ ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇటీవలే వెంకటేశ్ అయ్యర్ దేశవాళీ గణాంకాలు చూశానని.. ఫస్ట్‌క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్‌లో అతని రికార్డు అద్భుతంగా ఉందని.. 47 సగటు, 92 స్ట్రైక్‌రేట్‌తో అత్యుత్తమంగా రాణించాడని కొనియాడాడు. ఈ గణాంకాలను కొలమానంగా తీసుకుంటే అతని ఏ స్థాయి ఆటగాడో స్పష్టమవుతుందని పేర్కొన్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న అయ్యర్.. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సమర్ధుడని, కీలక సమయాల్లో బంతితోనూ మ్యాజిక్ చేయగల సామర్ధ్యం అతని సొంతమని ఆకాశానికెత్తాడు. బ్యాక్ ఫుట్‌పై అతను ఆడే పుల్ షాట్లు, కట్ షాట్లు అత్యద్భుతమని.. ఈ నైపుణ్యం అతన్ని ప్రపంచ స్థాయి బ్యాటర్ల జాబితాలో చేరుస్తుందని పేర్కొన్నాడు.
మొత్తంగా అయ్యర్ తన ఆల్‌రౌండ్ సామర్ధ్యంతో కేకేఆర్‌కు తరుపు ముక్కలా మారాడని పొగడ్తలతో ముంచెత్తాడు. కాగా, యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2021 రెండో దశలో కేకేఆర్ జట్టులోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. అరంగేట్రం మ్యాచ్(27 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్)లోనే అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచాడు. ఆ తర్వాత ముంబై(30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంజాబ్(49 బంతుల్లో 67; 9 ఫోర్లు, సిక్స్) జట్లపై హాఫ్ సెంచరీలు సాధించి ఔరా అనిపించాడు. బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ మాయ చేసిన అతను.. ఢిల్లీ(2/29), పంజాబ్(1/30) జట్లపై వికెట్లు సాధించాడు.
చదవండి: వార్నర్‌కు పట్టిన గతే ఆ సీఎస్‌కే ఆటగాడికి కూడా పడుతుంది..!
Comments
Please login to add a commentAdd a comment