న్యూఢిల్లీ: కనీసం టీమిండియా వరల్డ్‌కప్ ప్రదర్శనపై ఒక్క సమీక్షా సమావేశం లేకుండానే విరాట్ కోహ్లిని తిరిగి కెప్టెన్ కొనసాగించడాన్ని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఇదొక చేవలేని సెలక్షన్ కమిటీ అంటూ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును ప్రకటించే క్రమంలో సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నాడు. ‘ఇదొక కుంటి బాతు సెలక్షన్ కమిటీలా ఉంది. ముందుగా వెస్టిండీస్ పర్యటనకు కోహ్లి దూరం అవుతాడని సెలక్టర్లు చెప్పారు. ఒక్కసారిగా విండీస్ పర్యటనకు కోహ్లినే కెప్టెన్ అంటూ ప్రకటించారు. మూడు ఫార్మాట్లకు అతనే కెప్టెన్ అంటూ వెల్లడించారు. దాంతో అనేక ప్రశ్నలకు తావిచ్చారు బీసీసీఐ సెలక్టర్లు. సెలక్షన్ కమిటీ నిర్ణయం మేరకు కెప్టెన్ ఎంపిక జరిగిందా.. లేక కోహ్లి నిర్ణయం మేరకు కెప్టెన్ ఎంపిక జరిగిందా అంటూ గావస్కర్ ధ్వజమెత్తాడు.
దీనికి మరో మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ‘ కోహ్లిని కెప్టెన్‌గా నియమిస్తూ భారత్ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని గావస్కర్ తప్పుబట్టడం సరికాదు. నేను గావస్కర్ వాదనను గౌరవంగా తిరస్కరిస్తున్నా. వరల్డ్‌కప్‌లో భారత జట్టు ప్రదర్శన మరీ అంత చెత్తగా లేదు. అదే సమయంలో టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన బాగానే ఉంది. కెప్టెన్‌గా కోహ్లి నియామకం సరైనదే. కాకపోతే సెలక్టర్లు చిత్తశుద్ధిగా వ్యవహరించడం చాలా ముఖ్యం’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: ఇదేమి సెలక్షన్ కమిటీరా నాయనా!)
Comments
Please login to add a commentAdd a comment