దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో ప్రొటిస్ జట్టు కైవసం చేసుకుంది. అయితే రెండో వన్డేలో కూడా భారత బౌలర్లు పూర్తి స్ధాయిలో విఫలమయ్యారు. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా రాణించ లేకపోయారు. ఈ క్రమంలో భారత స్పిన్ విభాగంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్ ప్రత్యేక కారణం లేకుండానే తిరిగి వచ్చాడనీ, ప్రస్తుతం భారత జట్టుకు అతడు అవసరమైన స్పిన్నర్ కాదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
"అశ్విన్ ఎటువంటి కారణం లేకుండానే భారత వైట్-బాల్ జట్టులోకి తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభం నుంచి నేను చెప్పుతున్నాను. తిరిగి పరిమిత ఓవర్ల జట్టులోకి వస్తానాని అతడు కూడా ఊహించలేదు. కానీ సెలెక్టర్లు ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్ధంకావడం లేదు. అతడు భారత్‌కు అవసరమైన స్పిన్నర్ కాదని ఇప్పుడు భారత్ గ్రహిస్తుంది. మ్యాచ్ మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టే స్పిన్నర్లు భారత్‌కు కావాలి. స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ కూడా అంతగా రాణించలేకపోతున్నాడు. భారత జట్టు కుల్దీప్ యాదవ్ సేవలను కచ్చితంగా కోల్పోతోంది. అతడికి మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టే సత్తా ఉంది" అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.
చదవండి: SA vs IND: వన్డేల్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. తొలి ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment