ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. ఈ మ్యాచ్‌లో బట్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఓటమి తప్పదనుకున్న చోట బట్లర్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆరంభంలో తడబడింది. వరుస క్రమంలో జైశ్వాల్, సంజూ శాంసన్ వికెట్లు కోల్పోయి రాజస్తాన్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పరాగ్‌తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
అనంతరం పరాగ్, అశ్విన్, హెట్‌మైర్ వరుస క్రమంలో ఔటయ్యారు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖాయమైందని అంతా భావించారు. కానీ క్రీజులో ఉన్న బట్లర్ మాత్రం తన పట్టును విడలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి తన జోరును కొనసాగించాడు. తన హాఫ్ సెంచరీ పూర్తియ్యాక కేకేఆర్ బౌలర్లను బట్లర్ ఊచకోత కోశాడు.
ఆఖరివరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 60 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 107 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.
క్రిస్ గేల్ రికార్డు బద్దలు
ఓవరాల్‌గా బట్లర్‌కు ఇది ఏడో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం గేల్(6 సెంచరీలు) రికార్డును జోస్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో తొలి స్ధానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(8) ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో బట్లర్(7) నిలిచాడు.
Like this tweet if u witnessed jos Buttler Alone warrior century knock
— 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) April 16, 2024
Jos the boss you absolutely beauty #KKRvRR | #IPL2024 pic.twitter.com/EpWGnD1OOL
Comments
Please login to add a commentAdd a comment