జోష్‌ బట్లర్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో..! | Jos Buttler hits first century of the season as Rajasthan Royals | Sakshi
Sakshi News home page

IPL 2022: జోష్‌ బట్లర్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో..!

Published Sat, Apr 2 2022 5:59 PM | Last Updated on Sat, Apr 2 2022 7:46 PM

Jos Buttler hits first century of the season as Rajasthan Royals   - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో తొలి సెంచరీ నమోదైంది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోష్‌ బట్లర్‌ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. దీంతో తన ఐపీఎల్‌ కెరీర్‌లో బట్లర్‌ రెండో సెంచరీను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో  68 బంతుత్లో 100 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే జోష్‌ బట్లర్‌ సిక్స్‌లు, ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ 4 ఓవర్‌ వేసిన బసిల్‌ థంపీ బౌలింగ్‌లో.. 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో  బట్లర్‌  ఏకంగా 25 పరుగులు రాబట్టాడు.

అఖరికి 100 పరుగుల చేసిన బట్లర్‌ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. బట్లర్‌ సునామీ ఇన్నింగ్స్‌ ఫలితంగా రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. బట్లర్‌తో పాటు కెప్టెన్‌ శాంసన్‌(30), హెట్‌మైర్‌(35) పరుగులతో రాణించారు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా,మిల్స్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, పొలార్డ్‌ ఒక వికెట్‌ సాధించాడు.

చదవండి: IPL 2022- 1st Week: తొలివారంలో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన 11 మంది ఆటగాళ్లు వీరే!

చదవండి: జోష్‌ బట్లర్‌ ఇన్నిం‍గ్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement