విరాట్ కోహ్లి, జోస్ బట్లర్(PC: IPL/BCCI)
IPL 2022 Final GT Vs RR: ఐపీఎల్-2022లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్. 16 ఇన్నింగ్స్‌లో 824 పరుగులు సాధించి ఆరెంజ్‌క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అతడి అత్యధిక స్కోరు 116. నాలుగు సెంచరీలు.. నాలుగు అర్ధ శతకాలు నమోదు చేశాడు. మొత్తంగా 78 ఫోర్లు.. 45 సిక్సర్లు బాదాడు.
ఈ క్రమంలో ఆదివారం(మే 29) గుజరాత్ టైటాన్స్‌తో మెగా ఫైనల్ నేపథ్యంలో అరుదైన రికార్డుపై బట్లర్ కన్నేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే నాలుగు శతకాలు నమోదు చేసి.. రాయల్ చాలెంజర్స్ మాజీ సారథి విరాట్ కోహ్లి రికార్డును బట్లర్ సమం చేసిన విషయం తెలిసిందే.
ఇక కీలక మ్యాచ్‌లో గనుక అతడు సెంచరీ సాధిస్తే కోహ్లి ఘనతను అధిగమిస్తాడు. ఐదు సెంచరీలు నమోదు చేసి.. ఐపీఎల్ ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీల వీరుడి జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమిస్తాడు. ఈ లిస్టులో ఆరు సెంచరీలతో క్రిస్ గేల్ కోహ్లి, బట్లర్ కంటే ముందు వరుసలో ఉన్నాడు.
కాగా 2016లో కోహ్లి ఆర్సీబీ తరఫున 16 ఇన్నింగ్స్‌లో 973 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 7 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 113. ఇక ఆ సీజన్‌లో ఆర్సీబీ ఫైనల్ చేరినప్పటికీ సన్‌రైజర్స్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇక ఐపీఎల్-2022 క్వాలిఫైయర్-2లో ఆర్సీబీతో మ్యాచ్‌లో బట్లర్ ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో సెంచరీ సాధించిన ఆరో బ్యాటర్‌గా, క్వాలిఫైయర్-2లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
అదే విధంగా ఒక ఐపీఎల్ సీజన్‌లో 800 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇక టోర్నీ ఆసాంతం రాజస్తాన్‌కు బలంగా నిలిచిన బట్లర్ గుజరాత్‌తో ఫైనల్లో మరోసారి విజృంభించి రాజస్తాన్ రెండోసారి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
చదవండి 👇
IPL 2022 Final: అతడిని తుది జట్టు నుంచి తప్పించండి.. అప్పుడే: టీమిండియా మాజీ బ్యాటర్
IPL 2022 Prize Money: ఐపీఎల్ విజేత, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే!
Jaipur, you were amazing yesterday. 🥹💗#RoyalsFamily | #HallaBol | #RRvRCB pic.twitter.com/9vRP63Usa3
— Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022
Comments
Please login to add a commentAdd a comment