హెన్రిచ్ క్లాసెన్ అద్భుత సెంచరీ (PC: IPL/SRH)
IPl 2023 SRH vs RCB- Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్.. ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ నేనున్నానంటూ జట్టును ఆదుకునే క్లాస్ ప్లేయర్. ఈ సీజన్‌లో ఈ మిడిలార్డర్ ఇప్పటి వరకు చేసిన మొత్తం పరుగులు 430. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి ఈ మేరకు స్కోరు సాధించాడు.
మ్యాచ్ ఓడినా మనసులు గెలిచాడు
అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ ప్రొటిస్ బ్యాటర్. ఇక ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడినప్పటికీ క్లాసెన్ తన అద్భుత సెంచరీతో అభిమానుల మనసు గెలిచాడు. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులు రాబట్టాడు.
ఈ నేపథ్యంలో జట్టు మెరుగైన స్కోరు సాధించేలా ఒంటరి పోరాటం చేయడం అలవాటు చేసుకున్న అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం క్లాసెన్ అద్భుత బ్యాటింగ్ ఫిదా అయ్యానంటూ కితాబులిచ్చాడు.
ఏ విదేశీ ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో
‘‘క్లాసెన్ బ్యాటింగ్ అద్భుతం. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కొన్న తీరు అమోఘం. ఏ విదేశీ ప్లేయర్ కూడా తనలా ఇండియన్ పిచ్‌లపై స్పిన్నర్లను అటాక్ చేయడం నేను చూడలేదు.
విదేశీ ఆటగాళ్లనే కాదు ఈ టోర్నీలో ఆడుతున్న ప్రతి ఒక్క బ్యాటర్‌కు కూడా స్పిన్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తన మాస్టర్‌క్లాస్‌తో నిరూపించాడు. గత మూడు మ్యాచ్‌లలో అతడి బ్యాటింగ్ ఎంత అద్భుతంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పరిస్థితులకు తగ్గట్లుగా
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా క్లాసెన్‌లా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అతడు క్రీజులో నిలదొక్కుకుంటే చాలు.. పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా ఆడుతూనే దూకుడు కూడా ప్రదర్శిస్తాడు’’ అంటూ ఆకాశ్ చోప్రా.. హెన్రిచ్ క్లాసెన్ క్లాస్ ఇన్నింగ్స్‌ను కొనియాడాడు.
కాగా ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ తరఫున నిలకడైన ఆట తీరు కనబరుస్తున్న ఏకైక ఆటగాడు అంటే క్లాసెన్ ఒక్కడే! ఇక ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో తొలి సెంచరీ సాధించి శతక లోటు కూడా తీర్చేసుకున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.
చదవండి: అవన్నీ చెత్త మాటలు.. నేను అస్సలు పట్టించుకోను! గర్వంగా ఉంది: కోహ్లి
కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్‌రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ వైరల్
Klaasen mowa khundal khundal ke maarre 💯
— JioCinema (@JioCinema) May 18, 2023
Heroic Heinrich shines bright in Hyderabad with his maiden #TATAIPL ton ⚡️🔥#SRHvRCB #IPL2023 #IPLonJioCinema #EveryGameMatters | @SunRisers pic.twitter.com/s54WE0x5FR
Comments
Please login to add a commentAdd a comment