PC: IPL.com
IPL 2023 SRH Vs RCB- Virat Kohli: ఐపీఎల్-2023లో ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. గురువారం ఉప్పల్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఓపెనర్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. కీలక మ్యాచ్‌లో కింగ్ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ఆరో సెంచరీ
ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న విరాట్ 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు సాధించాడు. అదే విధంగా కెప్టెన్ డుప్లెసిస్‌తో కలిసి తొలి వికెట్‌కు 172 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కాగా ఐపీఎల్‌లో విరాట్‌కు ఇది 6వ ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. కాగా ఈ ఏడాది సీజన్‌లో కోహ్లి అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అతడి స్ట్రైక్ రేట్ మాత్రం తక్కువగా ఉందని పలువరు విమర్శించిన సంగతి తెలిసిందే. తన స్ట్రైక్ రేట్ గురించి వస్తున్న విమర్శలపై కోహ్లి స్పందించాడు.
చెత్త మాటలు
పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో విరాట్ మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ నా గత మ్యాచ్‌ల్లో ఎలా ఆడానన్న విషయం గురించి ఆలోచించను. ప్రస్తుతం ఏ మ్యాచ్‌లో అయితే ఆడుతున్నానో దాని గురించే ఆలోచిస్తా. కొన్ని సార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినప్పటకీ నేను సంతృప్తి చెందను. ఆ విషయం నాకు తెలుసు. అంతే తప్ప బయటనుంచి నా స్ట్రైక్ రేట్ గురించి ఎవరూ ఏమి మాట్లాడిన నేను పట్టించుకోను.
ఎందుకంటే అది వారి అభిప్రాయం. అవన్నీ చెత్త మాటలు.. పట్టించుకుంటే ముందుకు వెళ్లలేము. అటువంటి వారు నా పరిస్థితుల్లో ఉంటే తెలుస్తుంది. నేను ఎప్పుడూ జట్టును గెలిపించడానికే ఆడుతాను. పరిస్థితులకు అనుగుణంగా ఆడటం నాకు అలవాటు. అలా చేస్తున్నందకు నాకు గర్వంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.
చదవండి: IPL 2023: సెంచరీలతో చెలరేగిన కోహ్లి, క్లాసెన్.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలి సారి
What is the secret of the highly successful Virat-Faf pair?🤔
— IndianPremierLeague (@IPL) May 18, 2023
We will let King Kohli spill the beans 😉#TATAIPL | #SRHvRCB | @RCBTweets | @imVkohli | @faf1307 pic.twitter.com/BEKGcALbZK
Comments
Please login to add a commentAdd a comment