Courtesy: IPL Twitter
ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో డుప్లెసిస్ 96 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో జాగ్రత్తగా ఆడిన డుప్లెసిస్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో ఇంతవరకు సెంచరీ లేని డుప్లెసిస్ ఈసారి ఎలాగైనా ఆ ఫీట్ సాధిస్తాడని అనుకునేలోపే సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో హోల్డర్ బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కాగా డుప్లెసిస్ ఐపీఎల్‌లో 96 పరుగుల వద్ద ఔట్ కావడం ఇది రెండోసారి. ఇంతకముందు సీఎస్కే తరపున 2019లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక 2021 సీజన్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే తరపున ఆడిన డుప్లెసిస్ 95 పరుగులు నాటౌట్ గా నిలిచి సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఇదే సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 88 పరుగులు చేసి ఔటయ్యాడు. మొత్తానికి చాలా ఏళ్ల నుంచి ఐపీఎల్ ఆడుతున్నప్పటికి డుప్లెసిస్‌కు సెంచరీ కల అలాగే మిగిలిపోయింది.
నాలుగుసార్లు సెంచరీ అవకాశం వచ్చినప్పటికి.. మూడుసార్లు ఔట్.. ఒకసారి నాటౌట్‌గా మిగిలి సెంచరీని అందుకోలేకపోయాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్..''డుప్లెసిస్‌కు సెంచరీ చేసే యోగ్యం ఇప్పట్లో లేనట్లేనా'' అంటూ కామెంట్ చేశారు.
డుప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి
చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు
CLASS KNOCK! 🙌🏻
— Royal Challengers Bangalore (@RCBTweets) April 19, 2022
Well played, @faf1307! 👏🏻👏🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB pic.twitter.com/29kwOnhPb9
Comments
Please login to add a commentAdd a comment