RCB captain
-
టీమిండియా వైస్ కెప్టెన్‌కు షాక్
టీమిండియా వైస్ కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధనకు (Smriti Mandhana) హండ్రెడ్ లీగ్ (The Hundred League) ఫ్రాంచైజీ సథరన్ బ్రేవ్ (Southern Brave) షాకిచ్చింది. గత కొంతకాలంగా తమకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంధనను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. గత సీజన్లో మంధన విఫలం కావడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. మంధన గత సీజన్లో 5 మ్యాచ్‌ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే సాధించింది. గత సీజన్లో విఫలమైనా మంధనకు హండ్రెడ్ లీగ్‌లో మంచి రికార్డు ఉంది. 2022, 2023 సీజన్లలో ఆమె మంచి స్ట్రయిక్ రేట్‌తో వరుసగా 211, 238 పరుగులు చేసింది.ఆసక్తికరంగా మంధన ఆర్సీబీ టీమ్ మేట్ అయిన డానీ వ్యాట్‌ను (ఇంగ్లండ్ ఓపెనర్) సథరన్ బ్రేవ్ తొలి రీటెన్షన్గా దక్కించుకుంది. వ్యాట్‌తో పాటు లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మయా బౌచియర్, ఫ్రేయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కార్టీన్ కోల్మన్, రిహన్నా సౌత్బైలను కూడా రీటైన్ చేసుకుంది. రిటెన్షన్ జాబితాను సథరన్ బ్రేవ్ ఇవాళ ప్రకటించింది.మంధన ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో బిజీగా ఉంది. ఈ సీజన్లో ఆమె 4 మ్యాచ్‌ల్లో 122 పరుగులు చేసింది. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. మంధన ఈ సీజన్లో తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. ఫలితంగా భారం మొత్తం ఎల్లిస్ పెర్రీపై పడుతుంది. పెర్రీ ఈ సీజన్లో విశేషంగా రాణిస్తుంది. నిన్న యూపీతో జరిగిన మ్యాచ్‌లో పెర్రీ అజేయమైన 90 పరుగులు చేసినా ఆర్సీబీ ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్లో యూపీ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్సీబీ ఓటమిపాలైంది.డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్, ఢిల్లీపై విజయాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉన్నట్లు కనిపించింది. అయితే ఆతర్వాతి మ్యాచ్‌ల్లో వరుసగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ చేతుల్లో ఓడింది. అయినా ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ముంబై, యూపీ, ఢిల్లీ, గుజరాత్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 25) జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ, గుజరాత్ తలపడనున్నాయి. -
ఆర్సీబీ నూతన కెప్టెన్ రజత్ పాటిదార్ పర్సనల్ ( ఫోటోలు )
-
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. అధికారిక ప్రకటన
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నూతన కెప్టెన్‌ను ప్రకటించింది. వచ్చే సీజన్లో ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్ (Rajat Patidar) వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారికంగా వెల్లడించింది. 31 ఏళ్ల పాటిదార్ గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీలో కీలక ప్లేయర్‌గా వ్యవహిరిస్తున్నాడు. తొలుత ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి మళ్లీ బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారమంతా ఊహాగానాలే అని తేలిపోయింది. విరాట్‌కు కెప్టెన్సీ చేసే ఉద్దేశం లేకనే పాటిదార్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పాటిదార్.. గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. పాటిదార్‌కు రంజీల్లో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. పాటిదార్ కొన్ని సందర్భాల్లో ఆర్సీబీ కెప్టెన్‌గానూ (తాత్కాలిక) వ్యవహరించాడు. తాజా పరిణామంతో పాటిదార్ ఆర్సీబీ ఎనిమిదో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతంలో రాహుల్ ద్రవిడ్ (2008), కెవిన్ పీటర్సన్ (2009), అనిల్ కుంబ్లే (2009), డేనియల్ వెటోరీ (2011), విరాట్ కోహ్లి (2011), షేన్ వాట్సన్ (2017), ఫాప్ డుప్లెసిస్ (2022) ఆర్సీబీ కెప్టెన్లుగా వ్యవహరించారు.2022 నుంచి 2024 వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్‌ను మెగా వేలంలో తిరిగి రీటైన్ చేసుకోకపోవడంతో 2025 సీజన్‌కు ముందు ఆర్సీబీ కెప్టెన్ లేకుండా ఉండింది. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పాటిదార్ అప్పటినుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నాడు. పాటిదార్.. తనదైన శైలిలో విధ్వంసం సృష్టించి ఆర్సీబీ మిడిలార్డర్లో డ్యాషింగ్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాటిదార్.. స్పిన్ మరియు పేస్ బౌలింగ్‌ను సమర్దవంతంగా ఎదుర్కొంటాడు. ఐపీఎల్ కెరీర్లో 27 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్ 158.85 స్ట్రయిక్‌రేట్‌తో 799 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీలు ఉన్నాయి.పాటిదార్‌ను ఇటీవల ముగిసిన మెగా వేలానికి ముందు ఆర్సీబీ రూ. 11 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది. ఆర్సీబీ రీటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో పాటిదార్ ఒకడు. పాటిదార్ కాకుండా ఆర్సీబీ విరాట్ కోహ్లి, యశ్ దయాల్‌ను రీటైన్ చేసుకుంది.కాగా, ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించని విషయం తెలిసిందే. 2009, 2011, 2016లో రన్నకప్గా నిలిచిన ఈ జట్టు.. 2015, 2020, 2021, 2022, 2024 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరింది. -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి..?
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా సమర్పణకు మరి కొద్ది గంటల సమయం (అక్టోబర్ 31 డెడ్‌లైన్) మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాళ్లను అట్టి పెట్టుకోనుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా రూ. 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ప్లేయర్‌ని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18, 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది.ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి..?రిటెన్షన్ లిస్ట్ సమర్పణ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల జాబితాను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు ఏకంగా కెప్టెన్లనే వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఈ జాబితాలో ఆర్సీబీ కూడా ఉన్నట్లు సమాచారం. ఆర్సీబీ తమ కెప్టెన్ ఫాఫ్ డెప్లెసిస్కు వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వయసు పైబడిన రిత్యా డుప్లెసిస్‌ను వేలానికి వదిలేయాలని ఆర్సీబీ భావిస్తుందట. ఈ క్రమంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ మరోసారి విరాట్ వైపు చూస్తుందని సమాచారం. కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి చేపట్టేందుకు విరాట్ కూడా సుముఖంగా ఉన్నాడని తెలుస్తుంది. విరాట్ 2021 సీజన్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో 2022 సీజన్ నుంచి డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
కోహ్లి కన్నీళ్లు పెట్టిన వేళ డ్యుప్లెసిస్ వ్యాఖ్యలు
-
బిగ్‌బాష్ లీగ్‌లో ఆడనున్న ఆర్సీబీ కెప్టెన్..!
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఈ బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకు సిద్దమయ్యాడు. బిగ్ బాష్ లీగ్ 12వ సీజన్ ఓవర్సీస్ డ్రాఫ్ట్ నామినీల జాబితాలో తన పేరును డుప్లెసిస్ నమోదు చేసుకున్నాడు. ఇక బిగ్ బాష్ లీగ్‌లో ఇప్పటి వరకు డుప్లెసిస్ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. 2012 సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ఫాప్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో 17 బంతులు ఆడిన డుప్లెసిస్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక ఈ ఏడాది టోర్నమెంట్ హాఫ్ సీజన్‌కు డుప్లెసిస్ అందు బాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అత్యధిక జీతం కలిగిన ప్లాటినం విభాగంలో డుప్లెసిస్ చోటు దక్కించుకోవచ్చు అని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కేటగిరీలో ఒక ఆటగాడు అత్యధికంగా 340,000 ఆస్ట్రేలియా డాలర్ల జీతం పొందుతాడు. ఇక అతడితో పాటు ఆ దేశ ఆటగాళ్లు రిలీ రోసోవ్, మార్చంట్ డి లాంగే కూడా తమ పేర్లును నమోదు చేసుకున్నారు. చదవండి: Ind Vs Eng: వాళ్లకు ఐపీఎల్ ముఖ్యం.. ఇది చాలా డేంజర్: బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు -
ఆర్సీబీ కెప్టెన్‌కు సెంచరీ యోగ్యం లేదా!
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో డుప్లెసిస్ 96 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో జాగ్రత్తగా ఆడిన డుప్లెసిస్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో ఇంతవరకు సెంచరీ లేని డుప్లెసిస్ ఈసారి ఎలాగైనా ఆ ఫీట్ సాధిస్తాడని అనుకునేలోపే సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో హోల్డర్ బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా డుప్లెసిస్ ఐపీఎల్లో 96 పరుగుల వద్ద ఔట్ కావడం ఇది రెండోసారి. ఇంతకముందు సీఎస్కే తరపున 2019లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక 2021 సీజన్లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే తరపున ఆడిన డుప్లెసిస్ 95 పరుగులు నాటౌట్ గా నిలిచి సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఇదే సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 88 పరుగులు చేసి ఔటయ్యాడు. మొత్తానికి చాలా ఏళ్ల నుంచి ఐపీఎల్ ఆడుతున్నప్పటికి డుప్లెసిస్‌కు సెంచరీ కల అలాగే మిగిలిపోయింది. నాలుగుసార్లు సెంచరీ అవకాశం వచ్చినప్పటికి.. మూడుసార్లు ఔట్.. ఒకసారి నాటౌట్‌గా మిగిలి సెంచరీని అందుకోలేకపోయాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్..''డుప్లెసిస్‌కు సెంచరీ చేసే యోగ్యం ఇప్పట్లో లేనట్లేనా'' అంటూ కామెంట్ చేశారు. డుప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు CLASS KNOCK! 🙌🏻 Well played, @faf1307! 👏🏻👏🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB pic.twitter.com/29kwOnhPb9 — Royal Challengers Bangalore (@RCBTweets) April 19, 2022 -
ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. బెంగళూరు అధికారిక ప్రకటన
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు బెంగళూరులో నిర్వహించిన "ఆర్సీబీ ఆన్‌బాక్స్" ఈవెంట్‌లోఈ విషయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ వెల్లడించింది. ఇక ఐపీఎల్-2021 తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ కోహ్లి సారథ్య బాధ్యతలు చేపట్టున్నాడని వార్తలు వినిపించాయి. ఆర్సీబీ తాజా ప్రకటనతో ఆ వార్తలకు బ్రేక్ పడింది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా ఫఫ్ డు ప్లెసిస్‌ను ఆర్సీబీ రూ. 7కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన డు ప్లెసిస్ అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్-2021 సీజన్లో 633 పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా డు ప్లెసిస్ నిలిచాడు. గత ఏడాది చెన్నై టైటిల్ గెలవడంలో డు ప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు. ఇక ప్రొటీస్ జట్టు తరఫున 37 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి.. 23 మ్యాచ్‌లలో విజయాలు అందుకున్నాడు. చదవండి: Ind Vs Sl 2nd Test: అప్పుడు సెహ్వాగ్ .. ఇప్పుడు మయాంక్ అగర్వాల్.. తొమ్మిదేళ్ల తర్వాత! The Leader of the Pride is here! Captain of RCB, @faf1307! 🔥#PlayBold #RCBCaptain #RCBUnbox #ForOur12thMan #UnboxTheBold pic.twitter.com/UfmrHBrZcb — Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2022 -
IPL 2022- Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకోవడానికి అసలు కారణమిదే: కోహ్లి
-
IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా మనీశ్ పాండే..?
Manish Pandey Likely To Replace Virat Kohli As RCB Captain: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సారధ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న నేపథ్యంలో ఆ జట్టు తర్వాతి కెప్టెన్ ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో భాగంగా కోహ్లి సహా మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను అట్టిపెట్టుకున్న ఆర్సీబీ.. మ్యాక్సీ, సిరాజ్‌లలో ఒకరిని కెప్టెన్‌గా ఎంచుకుంటుందన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే, అనూహ్యంగా ఆర్సీబీ కెప్టెన్సీ రేసులోకి మనీశ్ పాండే వచ్చాడు. దేశవాళీ టోర్నీల్లో కర్ణాటక జట్టు కెప్టెన్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన మనీశ్ పాండేను ఆర్సీబీ నూతన కెప్టెన్‌గా ఎంపిక చేయాలని ఫ్రాంఛైజీ అభిమానులను నుంచి భారీ ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో మనీశ్కే పగ్గాలు అప్పజెప్పాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. మనీశ్ 2009లో ఆర్సీబీ తరఫున ఆడుతూ ఐపీఎల్లో తొలి శతకం బాదిన భారత అటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ విషయాన్ని కూడా ఆర్సీబీ యాజమాన్యం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా స్వతహాగా కర్ణాటక వాసి కావడం, అలాగే ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉండటాన్ని సైతం యాజమాన్యం పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. మనీశ్ ఇప్పటివరకు 154 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 30.68 సగటుతో 3560 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే, ఆర్సీబీ సారధిగా మనీశ్‌తో పాటు ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు సైతం అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే వచ్చే ఏడాది(2022) ఫిబ్రవరిలో జరిగే మెగా వేలం వరకు ఎదురు చూడాల్సిందే. చదవండి: ఐపీఎల్ మెగా వేలానికి డేట్స్ ఫిక్స్! -
కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఆ వెంటే డివిలియర్స్ కూడా
Virat Kohli Cried After He Lost Against Kkr: ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే కెప్టెన్‌గా కోహ్లికు ఇదే చివరి సీజన్ కాగా.. ఈసారి ఎలాగైనా కప్ సాధించి కెప్టెన్‌గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని అతడు భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం విరాట్ గ్రౌండ్‌లోనే కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ వెంటే డివిలియర్స్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లి కన్నీరు పెట్టుకోవడం అభిమానులకు ఎంతో భాదను కలిగిస్తోంది. ఇన్నాళ్లు తనకు సహకరించిన యాజమాన్యం, సహాయక సిబ్బంది... మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ విరాట్ కోహ్లి ఉద్వేగభరిత ట్వీట్ కూడా చేశాడు. కాగా 2013 ఐపీఎల్ సీజన్ నుంచి ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి ఒక్కసారి కూడా జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. కోహ్లి ఇప్పటివరకు 140 మ్యాచ్‌ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు అందుకున్నాడు. మరో 4 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. చదవండి: Virat Kohli: ఆశించిన ఫలితం దక్కలేదు.. కోహ్లి భావోద్వేగం first time kohli is crying.Last match as RCB Captain. @imVkohli @BCCI @ICC @IPL #Kohli#crying#last#match#captain#rcb pic.twitter.com/kZDWQgwKRT — Shubham Yadav( Dainik Bhaskar) (@shubham00211591) October 11, 2021 -
వీరిలో ఎవరైనా ఆర్సీబీ కెప్టెన్ కావొచ్చు..?
Aakash Chopra Lists Options RCB Captain: 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అభిమానులును విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. అయితే కోహ్లి బాధ్యతలను ఎవరు స్వీకరిస్తున్నది ఇప్పడు ప్రశ్నగా మారింది. ఆర్సీబీకి కెప్టెన్సీ నియామకంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్న క్రమంలో కోహ్లీ నుంచి నాయకత్వం స్వీకరించగలరని భావించే కొంత మంది ఆటగాళ్ల జాబితాను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వెల్లడించాడు. అతడి జాబితాలో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, రవి అశ్విన్ మరియు శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. “ఒక వేళ శ్రేయస్ అయ్యర్‌ని ఢిల్లీ వదిలివేస్తుందా? అతడు కెప్టెన్ కావచ్చు. కేఎల్ రాహుల్ పంజాబ్‌లో కొనసాగుతారా? అతడిని వదులుకుంటే, అతడే కావచ్చు. మయాంక్ అగర్వాల్ బయటకు వస్తే , అతడు కావచ్చు. రవిచంద్రన్ అశ్విన్ విడుదలైతే, అతను కావచ్చు అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది జరగనున్న మెగా వేలం ముందు ఆర్సీబీ ఎబి డివిలియర్స్, కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, యుజ్వేంద్ర చాహల్‌లను నిలుపుకుంటుందని కూడా అతడు అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్ మరొక అభ్యర్థి అని పుకార్లు వస్తుందున.. తదుపరి కెప్టెన్ ఎవరు అవుతారో చూడటం చాలా ఆసక్తికరంగా ఉందని అతడు తెలిపాడు. కాగా పంజాబ్‌పై విజయంతో ఆర్సీబీప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉన్నందున బెంగళూరు గెలవాలని కోరుకుంటున్నాని చోప్రా చెప్పాడు. చదవండి: Sehwag Vs SRH: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా' -
కోహ్లీకి భారీ జరిమానా
పుణె: విధ్వంసకరమైన బ్యాటింగ్ తో పొట్టి క్రికెట్ పోటీలో భారీగా పరుగులు సాధిస్తోన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ) బౌలింగ్ విభాగంలో బలహీనంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆ బలహీనతను అధిగమించే క్రమంలో కీలకమైన ఓవర్లను ఏ బౌలర్ తో వేయించాలా అని తెగ మథనపడిపోతున్నాడు ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ! అలా ఆ...లోచిస్తూ..చిస్తూ అతను కాలాన్నీ హరిస్తున్నాడు. అయితే పుణే వేదికగా ధోనీ సారథ్యంలోని పుణే సూపర్ జెయింట్స్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో మాత్రం ఆర్ సీబీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ వ్యూహచర్చలతో టైమ్ ను కిల్ చేశారు. మ్యాచ్ చూసినవారెవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. ప్రేక్షకుల కన్నా ఈ విషయం రిఫరీకి బాగా అర్థమైంది. అందుకే కోహ్లీకి ఫైన్ పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సారథి కోహ్లీకి జరిమానా విధిస్తున్నట్లు మ్యాచ్ అనంతరం రిఫరీలు ప్రకటించారు. జరిమానా అంతాఇంతా కాదు ఏకంగా 20 వేల డాలర్లు! మన కరెన్సీలో రూ.13.3 లక్షలు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో స్లో ఓవర్ రేట్ కు ఇంత భారీ స్థాయిలో జరిమానా ఉండదు కానీ ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన నిబంధనల్లో జరిమానాల స్థాయి భారీగా ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ముగించాల్సిన సమయానికి ఆర్ సీబీ రెండు ఓవర్లు వెనుకబడిపోయింది. శుక్రవారం నాటి మ్యాచ్ లో కోహ్లీ సేన ధోని సేనపై 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ దిగన ఆర్సీబీ ఏబీ డివిలియర్స్, కోహ్లీల దూకుడుతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ఆదినుంచే తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.