Courtesy: IPL
Virat Kohli Cried After He Lost Against Kkr: ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే కెప్టెన్‌గా కోహ్లికు ఇదే చివరి సీజన్ కాగా.. ఈసారి ఎలాగైనా కప్ సాధించి కెప్టెన్‌గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని అతడు భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.
ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం విరాట్ గ్రౌండ్‌లోనే కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ వెంటే డివిలియర్స్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లి కన్నీరు పెట్టుకోవడం అభిమానులకు ఎంతో భాదను కలిగిస్తోంది. ఇన్నాళ్లు తనకు సహకరించిన యాజమాన్యం, సహాయక సిబ్బంది... మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ విరాట్ కోహ్లి ఉద్వేగభరిత ట్వీట్ కూడా చేశాడు. కాగా 2013 ఐపీఎల్ సీజన్ నుంచి ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి ఒక్కసారి కూడా జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. కోహ్లి ఇప్పటివరకు 140 మ్యాచ్‌ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు అందుకున్నాడు. మరో 4 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు.
చదవండి: Virat Kohli: ఆశించిన ఫలితం దక్కలేదు.. కోహ్లి భావోద్వేగం
first time kohli is crying.Last match as RCB Captain. @imVkohli @BCCI @ICC @IPL
— Shubham Yadav( Dainik Bhaskar) (@shubham00211591) October 11, 2021
#Kohli#crying#last#match#captain#rcb pic.twitter.com/kZDWQgwKRT
Comments
Please login to add a commentAdd a comment