royal challengers bangalore
-
RCB: ఇంకా రేసులోనే ఆర్సీబీ! అలా అయితే ప్లే ఆఫ్స్‌లో!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శనతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు జట్టులో ఉన్నా వరుస వైఫల్యాలతో చతికిలపడింది.ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఒక రకంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆర్సీబీ దాదాపుగా నిష్క్రమించినట్లే! అయితే, తిరిగి పుంజుకుంటే మాత్రం పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. అందుకు సాధ్యమయ్యే కొన్ని సమీకరణలు గమనిద్దాం!మరోమాట లేదు.. గెలవాల్సిందేమరోమాట లేకుండా ఆర్సీబీ ఇప్పటి నుంచి ఆడే అన్ని మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాలి. నెట్ రన్‌రేటు -1.046 మరీ దారుణంగా ఉంది కాబట్టి కచ్చితంగా భారీ విజయాలు సాధించాలి.అదే జరిగితే.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లు చేరి మొత్తం 14 అవుతాయి. అదే విధంగా.. నెట్ రన్‌రేటు కూడా మెరుగుపరచుకుంటే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. కాగా ఆర్సీబీకి తదుపరి సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్(రెండుసార్లు), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ భారీ తేడాతో గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆర్సీబీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.టాప్‌లో ఉన్న ఆ మూడు జట్లు..పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ తమకు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో ఎన్ని గెలిస్తే(తమపై మినహా) ఆర్సీబీకి అంత మంచిది. లక్నో, చెన్నై, ఢిల్లీ, గుజరాత్, ముంబై, పంజాబ్ కింగ్స్ ఈ జట్లు భారీ తేడాతో విజయం సాధించడం ఆర్సీబీకి ముఖ్యం.ఇంకెలా అంటే..►తొమ్మిదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ తమకు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో నాలుగు కంటే ఎక్కువ విజయాలు సాధించకూడదు.►ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన ఐదింటిలో రెండు కంటే.. ముంబై ఇండియన్స్ ఆరింటిలో మూడు కంటే ఎక్కువ గెలవకూడదు.►చెన్నై మిగిలిన ఆరు మ్యాచ్‌లలో రెండు కంటే.. గుజరాత్ ఐదింటిలో ఒకటి కంటే ఎక్కువ గెలవద్దు.►లక్నో మిగిలిన ఆరు మ్యాచ్‌లలో ఒకటి కంటే ఎక్కువ గెలవకూడదు.►కేకేఆర్, సన్‌రైజర్స్ మిగిలిని ఏడు మ్యాచ్‌లలో ఒకటి కంటే ఎక్కువ విజయాలు సాధిస్తే చాలు!►ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరేందుకు కొన్ని సమీకరణలు మాత్రమే ఇవి. ఇంతా జరిగినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుతుందా అంటే? ఏమో గుర్రం ఎగరావచ్చు! లేదంటే గురువారం నాటి సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఓడి పూర్తిగా నిష్క్రమించనూవచ్చు!!చదవండి: నువ్వు చాలా మంచోడివి ప్యాట్: కోహ్లి కామెంట్స్ వైరల్ -
'సీఎస్కే ఓపెనర్‌గా యువ సంచలనం.. ధోని బ్యాటింగ్‌కు వచ్చేది అప్పుడే'
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ 17వ సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. సాయంత్రం 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి పోరులో ఎలాగైనా విజయం సాధించి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో సీఎస్కే కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ల ఫొటో సెషన్‌కు ముందు ఎంఎస్ ధోనీ తన బాధ్యతలను యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించేశాడు. కాగా మొదటి మ్యాచ్ నేపథ్యంలో సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో చర్చించాడు. కివీ స్టార్ రచిన్ రవీంద్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని చోప్రా జోస్యం చెప్పాడు. అదేవిధంగా వేలంలో భారీ మొత్తం వెచ్చించి కొన్న యువ ఆటగాడు సమీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశముందని చోప్రా అభిప్రాయపడ్డాడు. రచిన్ రవీంద్ర.. రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి చెన్నై ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. అజింక్యా రహానే, డార్లీ మిచెల్ వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఐదో స్ధానంలో శివమ్ దూబే బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని బ్యాటింగ్‌కు వస్తారు. ఆపై శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ వంటి ఆల్‌రౌండర్లు క్రీజులోకి రానున్నారు. అయితే విదేశీ ప్లేయర్ల కోటాలో పతిరానా అందులో బాటులో లేడు కాబట్టి నాలుగో ఆటగాడిగా మొయిన్ అలీ లేదా ముస్తిఫిజర్ రెహ్మన్‌కు చోటు దక్కే అవకాశముంది. అదేవిధంగా యువ ఆటగాడు సమీర్ రిజ్వీని సీఎస్కే ఉపయోగించుకునే ఛాన్స్ ఉందని యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. -
రాజస్థాన్ రాయల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ విజయం
-
లక్నో చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయింది! ఒకవేళ అలా కాకపోయి ఉంటే!
IPL 2022 Eliminator LSG Vs RCB: ఐపీఎల్-2022లో కొత్త జట్టుగా ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచే అద్భుతమైన విజయాలు సాధించిన కేఎల్ రాహుల్ సేన.. టైటిల్ రేసులో నిలిచింది. అయితే ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమి చెందిన లక్నో.. ఈ ఏడాది సీజన్లో తమ ప్రయాణాన్ని ముగించింది. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని స్వీయ తప్పిదాల వల్ల ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అవేంటో ఓ సారి పరీశీలిద్దాం. ఫీల్డింగ్‌లో విఫలం ముఖ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ అనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య ఫీల్డింగ్‌లో చాలా వ్యత్యాసం కన్పించింది. ఆర్సీబీ ఫీల్డర్లు 20 నుంచి 30 పరుగుల వరకు కాపాడుకుంటే.. లక్నో ఫీల్డర్లు తమ చెత్త ఫీల్డింగ్‌తో 20 నుంచి 30 పరుగులు అదనంగా సమర్పించుకుంది. ఇదే విషయాన్ని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ధృవీకరించాడు. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటింగ్ హీరోలు రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్‌ల క్యాచ్‌లను వరుస ఓవర్లలో లక్నో ఫీల్డర్లు జారవిడిచారు. ఈ తప్పునకు లక్నో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 92 పరుగులను జోడించి ఆర్సీబీ 207 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు. .@niallnobiobrien states Lucknow fielding has been very low standard which also becomes the reason for their loss tonight. (📸 : IPL/BCCI)#NiallOBrien #LSG #RCB #ViratKohli #NotJustCricket #IPL2022 #Cricket #CricTracker #LSGvRCB #RajatPatidar #KLRahul pic.twitter.com/3VO8ATYA5B — CricTracker (@Cricketracker) May 25, 2022 డెత్ ఓవర్లలో భారీగా పరుగులు లక్నో ఓటమికి మరో కారణం డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం. లక్నో బౌలర్లు మ్యాచ్‌ను అద్భుతంగా ఆరంభించారు. తొలి ఓవర్లోనే ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను మొహ్సిన్ ఖాన్ ఔట్ చేశాడు. పాటిదార్ ఒక ఎండ్‌లో అద్భుతంగా ఆడుతున్నప్పటికీ.. కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్ వికెట్లను వరుసగా కోల్పోయింది. ఈ క్రమంలో 15 ఓవర్లకు లక్నో బౌలర్లు నాలుగు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో 170-180 పరుగుల మధ్య ఆర్సీబీ స్కోర్ సాధిస్తుందన్న అంచనాలు కనిపించాయి. అయితే డెత్ ఓవర్లలో లక్నో బౌలర్లు తేలిపోవడంతో లక్నో బౌలర్లు 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆఖరి ఐదు ఓవర్లలో లక్నో బౌలర్లు 84 పరుగులు సమర్పించుకున్నారుంటే వారి ఆట తీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. RCB was no where around 180 after 10 overs and then, Dinesh Karthik and Rajat Patidar took the total to 200+ ! What a terrific finish Boyss 🔥 pic.twitter.com/V2lDj6nbsq — Ankit Mandal (@_ankit_mandal_) May 25, 2022 బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు 208 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన లక్నో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసింది. తొలి ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న డికాక్ వికెట్‌ను లక్నో కోల్పోయింది. అనంతరం మనన్ వోహ్రా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే వోహ్రాకు ఈ టోర్న్‌మెంట్‌లో ఇదే తొలి మ్యాచ్ కావండంతో ఆరంభంలో కాస్త తడబడ్డాడు. అయితే రెండు సిక్స్‌లు బాదిన తర్వాత వోహ్రా ఔటయ్యాడు. కాగా పవర్ ప్లేలో వికెట్ కోల్పోయినప్పడు విధ్వంసకర ఆటగాడు ఎవిన్ లూయిస్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపకుండా, వోహ్రాను పంపి లక్నో పెద్ద తప్పే చేసింది. ఇక ఈ సీజన్లోనే సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన లూయిస్ అద్భుతమైన అర్ధసెంచరీ సాధించి లక్నోకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. అఖరికి హుడా, స్టోయినిష్ ఔటయ్యక ఆరో స్థానంలో లూయిస్ బ్యాటింగ్‌కు పంపడం దెబ్బతీసిందని చెప్పవచ్చు. ఈ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన లూయిస్ 6 బంతుల్లో కేవలం 2 పరగులు మాత్రమే చేశాడు. LSG never had a clue about their batting order right through the season. At least they have several months now to think about it. — Saurabh Malhotra (@MalhotraSaurabh) May 25, 2022 .@RCBTweets seal a spot in the #TATAIPL 2022 Qualifier 2! 👏 👏@faf1307 & Co. beat #LSG by 14 runs in the high-scoring Eliminator at the Eden Gardens, Kolkata. 👍 👍 Scorecard ▶️ https://t.co/cOuFDWIUmk #TATAIPL | #LSGvRCB pic.twitter.com/mOqY5xggUT — IndianPremierLeague (@IPL) May 25, 2022 చదవండి: Rajat Patidar: ఒత్తిడిలోనూ. వారెవ్వా.. నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్: కోహ్లి ప్రశంసలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. విధ్వంసకర ఆటగాడు వచ్చేశాడు.. ఇక బౌలర్లకు చుక్కలే!
ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుడ్ న్యూస్ అందింది. తన వివాహం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన ఆస్ట్రేలియా విధ్వసంకర ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఆర్సీబీ జట్టుతో చేరాడు. ఈ నేపథ్యంలో మూడు రోజులు పాటు మాక్స్వెల్ క్వారంటైన్లో ఉండనున్నాడు. అనంతరం ఏప్రిల్ 5న రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న ఆర్సీబీ తదుపరి మ్యాచ్‌కు మాక్స్వెల్ అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటికే కెప్టెన్ డుప్లెసిస్, కోహ్లి, హసరంగావంటి స్టార్ ఆటగాళ్లలో కూడి ఉన్న ఆర్సీబీ.. మాక్స్వెల్ రాకతో మరింత దృడంగా మారింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు మ్యాక్స్ వెల్ ను రూ. 12 కోట్లు వెచ్చించి ఆర్సీబీ రీటైన్ చేసుకుంది. ఆర్సీబీ జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, డేవిడ్ విల్లీ, ఫిన్ అలెన్, అనుజ్ రావత్, జోష్ హేజిల్‌వుడ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సిద్ధార్థ్ కౌల్, కర్ణ్ శర్మ, ఆకాష్ దీప్, మహిపాల్ లోమ్రోర్, చామ వి మిలింద్, లువ్నిత్ సిసోడియా , అనీశ్వర్ గౌతమ్, సుయాష్ ప్రభుదేసాయి చదవండి: IPL 2022: బరిలోకి దిగనున్న దీపక్ చాహర్.. ఎప్పటి నుంచి అంటే..? -
ఆఫ్ఘనిస్తాన్ యువ బౌలర్‌కు లక్కీ ఛాన్స్.. ఏకంగా ఆర్సీబీ తరపున!
ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 లెగ్ స్పిన్నర్ ఇజారుల్హక్ నవీద్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. ఐపీఎల్-2022 సీజన్‌కు గాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెట్ బౌలర్‌గా నవీద్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టులో నవీద్ సభ్యడుగా ఉన్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన నవీద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే ఇప్పడు నెట్స్‌లో తన బౌలింగ్ మార్క్‌ను నవీద్ చూపించనున్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్ వంటి స్టార్ ఆటగాళ్లకు నెట్స్‌లో బౌలింగ్ చేయనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన స్పిన్నర్లు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో కూడా తమదైన ముద్ర వేసుకున్నారు. రషీద్ ఖాన్,ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ నబీ వంటి వారు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన క్రికెటర్లే. ఇక మార్చి 26 నుంచి ఐపఘెల్-2022 ప్రారంభం కానుంది. అదే విధంగా ఆర్సీబీ జట్టుకు ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌లో మార్చి 27న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్సీబీ ఆటగాళ్లు ప్రాక్టీసు మొదలుపెట్టేశారు. చదవండి: IPL 2022: గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరితే టీ20 ప్రపంచకప్ జట్టులో నేనూ ఉంటా: టీమిండియా ప్లేయర్ ನಮ್ಮ DK ಸಾಹೇಬರು! 💪😎 Just @DineshKarthik acing his first practice session like a boss. 🔥@kreditbee #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #ನಮ್ಮRCB pic.twitter.com/ESOWp9ZRKh — Royal Challengers Bangalore (@RCBTweets) March 21, 2022 -
"వేలంలో 7 కోట్లు.. ఆర్సీబీ కెప్టెన్‌గా అతడే సరైనోడు"
బెంగుళూరు వేదికగా ఐపీఎల్-2022 మెగా వేలం జరుగుతోంది. ఈ ఏడాది వేలం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. తమ అభిమాన ఆటగాళ్లు ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తాడో అని నిరీక్షించారు. వారి అంచనాలకు తగినట్టుగానే శనివారం వేలం ప్రారంభమైన రోజే పలువురు స్టార్ క్రికెటర్లు వేలంలో భారీ ధర పలికారు. మొదటి రోజు ఆక్షన్ లో దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఫాప్ డుప్లిసెన్ ను రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీ రూ. 7 కోట్లకు దక్కించుకుంది. డుప్లెసిస్ వేలంలోకి రాగానే ఆర్సీబీ, సీఎస్క్ కే అతడి కోసం పోటీపడ్డాయి. చివరకు అతడిని ఆర్సీబీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రానున్న సీజన్లో ఆర్సీబీ జట్టుకు డుప్లెసిస్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "నా అభిప్రాయం ప్రకారం ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతడు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గత కొంత కాలంగా ఆడకపోయినప్పటికీ.. దేశవాలీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. త్వరలోనే కెప్టెన్‌గా డుప్లెసిస్‌ను బెంగళూరు ప్రకటించనుంది" అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. కాగా 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఆర్సీబీ విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, మహ్మద్ సిరాజ్‌లను రీటైన్ చేసుకుంది. చదవండి: IPL 2022 Auction: వయసు 37.. ధర 7 కోట్లు.. ఆర్సీబీ సొంతం.. మంచి డీల్.. మా గుండె పగిలింది! -
ఆర్సీబీ కోచ్‌గా ఏబీ డివిలియర్స్!
AB De Villiers Could Return To RCB Batting Coach: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, ఆర్సీబీ విద్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుని అభిమానులకు షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ.. ఫ్యాన్స్‌కు త్వరలో ఓ గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే సీజన్‌కు గాను ఆర్సీబీ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా డివిలియర్స్‌ను నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మిస్టర్ 360తో ఆర్సీబీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సంకేతాలను ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఇచ్చాడు. న్యూజిలాండ్- భారత్ రెండో టెస్ట్‌లో కామెంటేటర్‌గా సంజయ్ బంగర్ వ్యవహరిస్తున్నాడు. ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు ఆర్సీబీ కోసం భిన్నమైన పాత్రలను పోషించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నాడు. ఏబీ డివిల్లియర్స్ లాంటి ఆటగాడికి బ్యాటింగ్ కోచ్ పదవిని ఇస్తే మా జట్టు ఆటగాళ్లకి ఎంతో ఉపయోగకరమని అతడు తెలిపాడు. ‘ప్రధాన కోచ్‌గా నాకు ఎక్కువ సమయం ఉండదు. బ్యాటింగ్ కోచ్ ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఆటగాళ్ల లోపాలపై దృష్టిసారిస్తాడు. అందువల్ల, ప్రతి జట్టుకు ప్రధాన కోచ్ కాకుండా బ్యాటింగ్ కోచ్ అవసరం. అందుకే ఏబీ డివిలియర్స్‌ను బ్యాటింగ్ కోచ్‌గా లేదా కన్సల్టెంట్ కోచ్‌గా నియమించడానికి ప్రయత్నిస్తున్నాం" అని బంగర్ తెలిపాడు. కాగా సంజయ్ బంగర్ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌నుంచి హెడ్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: IND Vs NZ: అది నా డ్రీమ్ బాల్.. ఆసక్తికర వాఖ్యలు చేసిన మహ్మద్ సిరాజ్ -
ఆర్సీబీకి బిగ్ షాకిచ్చిన ఏబీ డివిలియర్స్
AB de Villiers Announces His Retirement From All Cricket: దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ఆర్సీబీ విద్వంసకర ఆటగాడు ఏబి డివిలియర్స్ సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పుతున్నట్లు డివిలియర్స్ శుక్రవారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఏబీ డివిలియర్స్ 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా.. ఐపీఎల్ లాంటి విదేశీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. తన వయస్సు పై బడిందని… అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏబీడీ తెలిపాడు. ఐపీఎల్లో గత కొన్నాళ్ల నుంచి ఆర్సీబీ తరుపున ఆడుతున్న మిస్టర్ 360.. భారత అభిమానుల్లో ప్రత్యేకమైన స్ధానం సంపాందించుకున్నాడు. ఈ క్రమంలో ఏబీడీ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. చివరగా ఐపీఎల్-2021లో ఆడిన ఏబి డివిలియర్స్.. 2 అర్ధ సెంచరీలతో 313 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు డివిలియర్స్ ఆడాడు. "ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నేను అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. పెరట్లో మా అన్నయ్యలతో మ్యాచ్ ఆడినప్పటి నుంచి మెదలు పెడితే, నేను స్వచ్ఛమైన ఆనందంతో, హద్దులేని ఉత్సాహంతో క్రికెట్ ఆడాను. ఇప్పుడు నా వయస్సు 37 ఏళ్లు దాటింది. ఈ వయసులో ఇదే సరైన నిర్ణయం. ఇన్నాళ్లు నాకు అండగా నిలిచిన అభిమానుల అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని డివిలియర్స్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్ కెప్టెన్సీకి రాజీనామా It has been an incredible journey, but I have decided to retire from all cricket. Ever since the back yard matches with my older brothers, I have played the game with pure enjoyment and unbridled enthusiasm. Now, at the age of 37, that flame no longer burns so brightly. pic.twitter.com/W1Z41wFeli — AB de Villiers (@ABdeVilliers17) November 19, 2021 -
కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఆ వెంటే డివిలియర్స్ కూడా
Virat Kohli Cried After He Lost Against Kkr: ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే కెప్టెన్‌గా కోహ్లికు ఇదే చివరి సీజన్ కాగా.. ఈసారి ఎలాగైనా కప్ సాధించి కెప్టెన్‌గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని అతడు భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం విరాట్ గ్రౌండ్‌లోనే కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ వెంటే డివిలియర్స్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లి కన్నీరు పెట్టుకోవడం అభిమానులకు ఎంతో భాదను కలిగిస్తోంది. ఇన్నాళ్లు తనకు సహకరించిన యాజమాన్యం, సహాయక సిబ్బంది... మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ విరాట్ కోహ్లి ఉద్వేగభరిత ట్వీట్ కూడా చేశాడు. కాగా 2013 ఐపీఎల్ సీజన్ నుంచి ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి ఒక్కసారి కూడా జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. కోహ్లి ఇప్పటివరకు 140 మ్యాచ్‌ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు అందుకున్నాడు. మరో 4 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. చదవండి: Virat Kohli: ఆశించిన ఫలితం దక్కలేదు.. కోహ్లి భావోద్వేగం first time kohli is crying.Last match as RCB Captain. @imVkohli @BCCI @ICC @IPL #Kohli#crying#last#match#captain#rcb pic.twitter.com/kZDWQgwKRT — Shubham Yadav( Dainik Bhaskar) (@shubham00211591) October 11, 2021 -
ఐపీఎల్లో టిమ్ డేవిడ్ సరికొత్త రికార్డు..
IPL 2021 RCB Vs CSK Match Tim David: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్‌లో ఆర్సీబీ తరపున ఆరంగేట్రం చేసిన సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా తమ దేశం తరపున ఐపీఎల్లో ఆడుతున్న తొలి ఆటగాడిగా డేవిడ్ రికార్డులకెక్కాడు. సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి(53, 41 బంతులు; 6 ఫోర్లు, 1 సిక్సర్), పడిక్కల్(70, 50 బంతులు; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం అందించినప్పటికి తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్ పూర్తిగా విఫలం కావడంతో ఆర్సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కాగా కోహ్లి, పడిక్కల్ మధ్య 111 పరుగుల భాగస్వామ్యం నమోదు కావడం విశేషం. ఇక సీఎస్కే బౌలర్లలో బ్రావో 3, శార్దూల్ ఠాకూర్ 2, దీపక్ చహర్ 1 వికెట్ తీశాడు. చదవండి: IPL 2021: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. ఇంటి దారి పట్టిన స్టార్ ఆల్‌రౌండర్ -
బ్లూ కలర్ జెర్సీలో కనిపించనున్న ఆర్సీబీ.. ఎందుకంటే?
RCB IPL Jersey 2021: యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ రెండో దశలో తమ మొదటి మ్యాచ్‌లో ఎరుపు రంగు జెర్సీలో కాకుండా బ్లూ కలర్ జెర్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగనుంది. రాయల్ ఛాలెంజర్స్ సెప్టెంబర్ 20 న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో.. రెండేళ్లుగా కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి కృతజ్ఞతగా రెడ్ జెర్సీకి బదులుగా బ్లూ జెర్సీని కోహ్లి సేన ధరించనుంది. "కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అమూల్యమైన సేవకు నివాళి అర్పించేందకు...ఫ్రంట్‌లైన్ యోధుల పీపీఈ కిట్ల రంగును పోలివుండే బ్లూ జెర్సీని ధరించడం ఆర్సీబీ సభ్యులుగా మాకు గర్వకారణం’ అని ట్విట్ చేసింది. కాగా గత కొద్ది సీజన్ల నుంచి ఏదో ఒక మ్యాచ్ లో పర్యావరణం పట్ల తమ మద్దతును తెలపడానకి ఆకుపచ్చ జెర్సీని ఆర్సీబీ ధరించేది. ఐపీఎల్ ఫేజ్-1 సమయంలో కూడా మే 3 న కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో బ్లూ జెర్సీలో కనిపించబోతున్నట్లు ఆర్సీబీ జట్టు ప్రకటించింది. కరోనా కారణంగా ఐపీఎల్ ఆర్ధవంతంగా వాయిదా పడడంతో ఇప్పుడు బ్లూ జెర్సీను ధరించనునన్నారు. అయితే ఫేజ్-1 రాయల్ ఛాలెంజర్స్ మొదటి ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కాగా కాగా సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుంది. చదవండి: Surya Kumar Yadav: పృథ్వీ షా విషెస్.. నవ్వులు పూయిస్తోన్న ఫొటో! United to help and support the frontline warriors who have worked selflessly and tirelessly to fight the Covid Pandemic. 🙌🏻🙌🏻 We are #1Team1Fight! 🔴🔵#PlayBold #WeAreChallengers #IPL2021 #KKRvRCB pic.twitter.com/W7fMXnvwrL — Royal Challengers Bangalore (@RCBTweets) September 14, 2021 -
ఇంత చెత్తగా ఆరంభిస్తాం అనుకోలేదు: కోహ్లి
చెన్నై : చెన్నైసూపర్ కింగ్స్(సీఎస్కే)తో జరిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో తమ ఓటమికి చెత్త బ్యాటింగే కారణమని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లి మాట్లాడుతూ.. ‘ఎవరూ ఇలా ఆరంభించాలనుకోరు. కానీ మా పోరాటం సంతోషాన్నిచ్చింది. అతి స్వల్ప స్కోర్‌ను కాపాడుకుంటూ మ్యాచ్‌ను 18వ ఓవర్ వరకు తీసుకెళ్లడం ఆకట్టుకుంది. బ్యాటింగ్ మాత్రం చాలా దారుణంగా చేశాం. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. గాల్లోని తేమను చూసి తొలుత 140-150 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశిస్తామనుకున్నా. కానీ అది కుదరలేదు. లీగ్‌ను చాలా చెత్తగా ఆరంభించాం. ఈ ఓటమి నుంచి జట్టు తేరుకుంటుందా? లేదా? అని ఆలోచించడం లేదు. గత నాలుగు రోజులగా ఈ పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. ఏది ఏమైనప్పటికీ మేం బ్యాటింగ్ బాగా చేయాల్సింది. కనీసం 110 నుంచి 120 పరుగులు చేసినా పోరాడటానికి వీలుండేది. మా పేసర్ నవదీప్ షైనీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సీఎస్కే మా కన్నా అద్భుత ప్రదర్శన కనబర్చింది. వారు ఈ విజయానికి అర్హులు. కానీ మా జట్టు పోరాట స్పూర్తి ఆకట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. పార్థివ్ పటేల్ (35 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్. హర్భజన్, ఇమ్రాన్ తాహిర్ చెరో 3 వికెట్లు తీయగా... రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు లభించాయి. తర్వాత చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసి గెలిచింది. రాయుడు (42 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. హర్భజన్ సింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్
రాజ్‌కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఆదివారం ఇక్కడ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గుజరాత్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌లు ఆడగా రాయల్ చాలెంజర్స్ రెండింట్లో గెలవగా, గుజరాత్ జట్టు మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్),ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, మన్ దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్,స్టువర్ట్ బిన్నీ, ఇక్బాల్ అబ్దుల్లా,రిచర్డ్ సన్, తబ్రియాజ్ షంమ్సీ, చాహల్ గుజరాత్ లయన్స్ తుది జట్టు: సురేష్ రైనా(కెప్టెన్), అరోన్ ఫించ్, బ్రెండన్ మెకల్లమ్, దినేష్ కార్తీక్, డ్వేన్ స్మిత్, బ్రేవో,ప్రవీణ్ కుమార్, ధావల్ కులకర్ణి, జకాతీ, తాంబే