ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 లెగ్ స్పిన్నర్ ఇజారుల్హక్ నవీద్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. ఐపీఎల్-2022 సీజన్‌కు గాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెట్ బౌలర్‌గా నవీద్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టులో నవీద్ సభ్యడుగా ఉన్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన నవీద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
అయితే ఇప్పడు నెట్స్‌లో తన బౌలింగ్ మార్క్‌ను నవీద్ చూపించనున్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి స్టార్ ఆటగాళ్లకు నెట్స్‌లో బౌలింగ్ చేయనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన స్పిన్నర్‌లు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా తమదైన ముద్ర వేసుకున్నారు.
రషీద్ ఖాన్,ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ నబీ వంటి వారు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన క్రికెటర్లే. ఇక మార్చి 26 నుంచి ఐపఘెల్-2022 ప్రారంభం కానుంది. అదే విధంగా ఆర్సీబీ జట్టుకు ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌లో మార్చి 27న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్సీబీ ఆటగాళ్లు ప్రాక్టీసు మొదలుపెట్టేశారు.
చదవండి: IPL 2022: గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరితే టీ20 ప్రపంచకప్ జట్టులో నేనూ ఉంటా: టీమిండియా ప్లేయర్
ನಮ್ಮ DK ಸಾಹೇಬರು! 💪😎
— Royal Challengers Bangalore (@RCBTweets) March 21, 2022
Just @DineshKarthik acing his first practice session like a boss. 🔥@kreditbee #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #ನಮ್ಮRCB pic.twitter.com/ESOWp9ZRKh
Comments
Please login to add a commentAdd a comment