IPL 2022: Glenn Maxwell Joins RCB Team After Traditional Indian Wedding in Chennai - Sakshi
Sakshi News home page

IPL 2022: ఆర్సీబీకి గుడ్‌ న్యూస్‌.. విధ్వంసకర ఆటగాడు వచ్చేశాడు.. ఇ​క బౌలర్లకు చుక్కలే!

Published Sun, Apr 3 2022 4:45 PM | Last Updated on Sun, Apr 3 2022 6:08 PM

IPL 2022: Glenn Maxwell joins RCB camp - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ ముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు గుడ్‌ న్యూస్‌ అందింది. తన వివాహం కారణంగా ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన ఆస్ట్రేలియా విధ్వసంకర ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఆర్సీబీ జట్టుతో చేరాడు. ఈ నేపథ్యంలో మూడు రోజులు పాటు మాక్స్‌వెల్‌ క్వారంటైన్‌లో ఉండనున్నాడు.

అనంతరం ఏప్రిల్ 5న రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న ఆర్సీబీ తదుపరి మ్యాచ్‌కు  మాక్స్‌వెల్‌ అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటికే కెప్టెన్‌ డుప్లెసిస్‌, కోహ్లి, హసరంగావంటి స్టార్‌ ఆటగాళ్లలో కూడి ఉన్న ఆర్సీబీ.. మాక్స్‌వెల్‌ రాకతో మరింత దృడంగా మారింది. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు మ్యాక్స్ వెల్ ను రూ. 12 కోట్లు వెచ్చించి ఆర్సీబీ రీటైన్‌ చేసుకుంది.

ఆర్సీబీ జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, డేవిడ్ విల్లీ, ఫిన్ అలెన్, అనుజ్ రావత్, జోష్ హేజిల్‌వుడ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సిద్ధార్థ్ కౌల్, కర్ణ్ శర్మ, ఆకాష్ దీప్, మహిపాల్ లోమ్రోర్, చామ వి మిలింద్, లువ్‌నిత్ సిసోడియా , అనీశ్వర్ గౌతమ్, సుయాష్ ప్రభుదేసాయి

చదవండి: IPL 2022: బరిలోకి దిగనున్న దీపక్‌ చాహర్‌.. ఎప్పటి నుంచి అంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement