RCB IPL Jersey 2021: యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ రెండో దశలో తమ మొదటి మ్యాచ్‌లో ఎరుపు రంగు జెర్సీలో కాకుండా బ్లూ కలర్ జెర్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగనుంది. రాయల్ ఛాలెంజర్స్ సెప్టెంబర్ 20 న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో.. రెండేళ్లుగా కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి కృతజ్ఞతగా రెడ్ జెర్సీకి బదులుగా బ్లూ జెర్సీని కోహ్లి సేన ధరించనుంది. "కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అమూల్యమైన సేవకు నివాళి అర్పించేందకు...ఫ్రంట్‌లైన్ యోధుల పీపీఈ కిట్‌ల రంగును పోలివుండే బ్లూ జెర్సీని ధరించడం ఆర్సీబీ సభ్యులుగా మాకు గర్వకారణం’ అని ట్విట్ చేసింది.
కాగా గత కొద్ది సీజన్ల నుంచి ఏదో ఒక మ్యాచ్ లో పర్యావరణం పట్ల తమ మద్దతును తెలపడానకి ఆకుపచ్చ జెర్సీని ఆర్సీబీ ధరించేది. ఐపీఎల్ ఫేజ్-1 సమయంలో కూడా మే 3 న కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో బ్లూ జెర్సీలో కనిపించబోతున్నట్లు ఆర్సీబీ జట్టు ప్రకటించింది. కరోనా కారణంగా ఐపీఎల్ ఆర్ధవంతంగా వాయిదా పడడంతో ఇప్పుడు బ్లూ జెర్సీను ధరించనునన్నారు. అయితే ఫేజ్-1 రాయల్ ఛాలెంజర్స్ మొదటి ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కాగా కాగా సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుంది.
చదవండి: Surya Kumar Yadav: పృథ్వీ షా విషెస్.. నవ్వులు పూయిస్తోన్న ఫొటో!
United to help and support the frontline warriors who have worked selflessly and tirelessly to fight the Covid Pandemic. 🙌🏻🙌🏻
— Royal Challengers Bangalore (@RCBTweets) September 14, 2021
We are #1Team1Fight! 🔴🔵#PlayBold #WeAreChallengers #IPL2021 #KKRvRCB pic.twitter.com/W7fMXnvwrL
Comments
Please login to add a commentAdd a comment