బెంగుళూరు వేదికగా ఐపీఎల్-2022 మెగా వేలం జరుగుతోంది. ఈ ఏడాది వేలం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. తమ అభిమాన ఆటగాళ్లు ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తాడో అని నిరీక్షించారు. వారి అంచనాలకు తగినట్టుగానే శనివారం వేలం ప్రారంభమైన రోజే పలువురు స్టార్ క్రికెటర్లు వేలంలో భారీ ధర పలికారు. మొదటి రోజు ఆక్షన్ లో దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఫాప్ డుప్లిసెన్ ను రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీ రూ. 7 కోట్లకు దక్కించుకుంది. డుప్లెసిస్ వేలంలోకి రాగానే ఆర్సీబీ, సీఎస్క్ కే అతడి కోసం పోటీపడ్డాయి. చివరకు అతడిని ఆర్సీబీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
రానున్న సీజన్‌లో ఆర్సీబీ జట్టుకు డుప్లెసిస్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "నా అభిప్రాయం ప్రకారం ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతడు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గత కొంత కాలంగా ఆడకపోయినప్పటికీ.. దేశవాలీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. త్వరలోనే కెప్టెన్‌గా డుప్లెసిస్‌ను బెంగళూరు ప్రకటించనుంది" అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. కాగా 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఆర్సీబీ విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను రీటైన్ చేసుకుంది.
చదవండి: IPL 2022 Auction: వయసు 37.. ధర 7 కోట్లు.. ఆర్సీబీ సొంతం.. మంచి డీల్.. మా గుండె పగిలింది!
Comments
Please login to add a commentAdd a comment