ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా సమర్పణకు మరి కొద్ది గంటల సమయం (అక్టోబర్ 31 డెడ్‌లైన్) మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాళ్లను అట్టి పెట్టుకోనుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది.
ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా రూ. 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ప్లేయర్‌ని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18, 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది.
ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి..?
రిటెన్షన్ లిస్ట్ సమర్పణ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల జాబితాను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు ఏకంగా కెప్టెన్లనే వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఈ జాబితాలో ఆర్సీబీ కూడా ఉన్నట్లు సమాచారం. ఆర్సీబీ తమ కెప్టెన్ ఫాఫ్ డెప్లెసిస్‌కు వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
వయసు పైబడిన రిత్యా డుప్లెసిస్‌ను వేలానికి వదిలేయాలని ఆర్సీబీ భావిస్తుందట. ఈ క్రమంలో ఆర్సీబీ మేనేజ్‌మెంట్ మరోసారి విరాట్ వైపు చూస్తుందని సమాచారం. కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి చేపట్టేందుకు విరాట్ కూడా సుముఖంగా ఉన్నాడని తెలుస్తుంది. విరాట్ 2021 సీజన్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో 2022 సీజన్ నుంచి డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment