
PC: IPL.com
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఈ బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకు సిద్దమయ్యాడు. బిగ్ బాష్ లీగ్ 12వ సీజన్ ఓవర్సీస్ డ్రాఫ్ట్ నామినీల జాబితాలో తన పేరును డుప్లెసిస్ నమోదు చేసుకున్నాడు. ఇక బిగ్ బాష్ లీగ్‌లో ఇప్పటి వరకు డుప్లెసిస్ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. 2012 సీజన్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ఫాప్ ప్రాతినిధ్యం వహించాడు.
ఈ మ్యాచ్‌లో 17 బంతులు ఆడిన డుప్లెసిస్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక ఈ ఏడాది టోర్నమెంట్ హాఫ్ సీజన్‌కు డుప్లెసిస్ అందు బాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అత్యధిక జీతం కలిగిన ప్లాటినం విభాగంలో డుప్లెసిస్ చోటు దక్కించుకోవచ్చు అని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కేటగిరీలో ఒక ఆటగాడు అత్యధికంగా 340,000 ఆస్ట్రేలియా డాలర్ల జీతం పొందుతాడు. ఇక అతడితో పాటు ఆ దేశ ఆటగాళ్లు రిలీ రోసోవ్, మార్చంట్ డి లాంగే కూడా తమ పేర్లును నమోదు చేసుకున్నారు.
చదవండి: Ind Vs Eng: వాళ్లకు ఐపీఎల్ ముఖ్యం.. ఇది చాలా డేంజర్: బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment