
కేప్ టౌన్: యూఏఈ, ఒమన్ వేదికగా వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికా జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. తెంబ బవుమా సారథ్యంలో15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. కాగా సీనియర్ ఆటగాళ్లు ఫాఫ్ డుప్లెసిస్, క్రిస్ మోరీస్,ఇమ్రాన్ తాహీర్‌లకు టీ20 వరల్డ్‌కప్ ఆడే జట్టులో చోటు దక్కలేదు.
ఫామ్‌లో ఉన్నప్పటికీ బోర్డు వారిని పక్కనపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డుప్లెసిస్, ఇమ్రాన్ తాహీర్ ప్రస్తుతం కరీబీయన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నారు. కాగా సౌత్ ఆఫ్రికా తన తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.
దక్షిణాఫ్రికా జట్టు: తెంబ బవుమా (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), పార్చూన్, హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, మర్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోర్తేజ్, ప్రొటోరియస్, కగిసో రబాడ, షంషీ, దుస్సేన్.
రిజర్వ్ ప్లేయర్లు: జార్జ్ లిండే, ఫెహ్లువాయో, విలియమ్స్
చదవండి: Six Balls Six Sixes: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment