వీరిలో ఎవరైనా ఆర్సీబీ కెప్టెన్ కావొచ్చు..? | Who Will Replace Virat Kohli as RCB Captain Aakash Chopra Lists Options | Sakshi
Sakshi News home page

Aakash Chopra: వీరిలో ఎవరైనా ఆర్సీబీ కెప్టెన్ కావొచ్చు..?

Published Mon, Oct 4 2021 5:26 PM | Last Updated on Mon, Oct 4 2021 6:59 PM

Who Will Replace Virat Kohli as RCB Captain Aakash Chopra Lists Options - Sakshi

PC: IPL

Aakash Chopra Lists Options RCB Captain: 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అభిమానులును విరాట్‌ కోహ్లి నిరాశపరిచాడు. అయితే కోహ్లి బాధ్యతలను ఎవరు స్వీకరిస్తున్నది ఇప్పడు ప్రశ్నగా మారింది. ఆర్సీబీకి కెప్టెన్సీ నియామకంపై పలు  ఊహాగానాలు చెలరేగుతున్న క్రమంలో కోహ్లీ నుంచి నాయకత్వం స్వీకరించగలరని భావించే కొంత మంది ఆటగాళ్ల జాబితాను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వెల్లడించాడు. అతడి జాబితాలో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, రవి అశ్విన్ మరియు శ్రేయస్ అయ్యర్‌  ఉన్నారు. 

“ఒక వేళ శ్రేయస్ అయ్యర్‌ని ఢిల్లీ వదిలివేస్తుందా? అతడు  కెప్టెన్‌ కావచ్చు. కేఎల్ రాహుల్ పంజాబ్‌లో కొనసాగుతారా? అతడిని వదులుకుంటే, అతడే కావచ్చు. మయాంక్ అగర్వాల్ బయటకు వస్తే , అతడు  కావచ్చు. రవిచంద్రన్ అశ్విన్ విడుదలైతే, అతను కావచ్చు అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

కాగా ఈ ఏడాది జరగనున్న  మెగా వేలం ముందు ఆర్సీబీ ఎబి డివిలియర్స్, కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, యుజ్వేంద్ర చాహల్‌లను నిలుపుకుంటుందని కూడా అతడు అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్ మరొక అభ్యర్థి అని పుకార్లు వస్తుందున.. తదుపరి కెప్టెన్ ఎవరు అవుతారో చూడటం చాలా ఆసక్తికరంగా ఉందని అతడు తెలిపాడు.  కాగా పంజాబ్‌పై విజయంతో ఆర్సీబీప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇంకా   ఒక మ్యాచ్‌ మిగిలి ఉన్నందున బెంగళూరు గెలవాలని కోరుకుంటున్నాని చోప్రా చెప్పాడు.

చదవండి: Sehwag Vs SRH: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement