Syed Mushtaq Ali T20 Trophy: Prithvi Shaw Century And Got Out For 134 Runs-61-Balls - Sakshi
Sakshi News home page

Syed Mushtaq Ali T20: సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా.. ముంబై భారీస్కోరు

Published Fri, Oct 14 2022 12:52 PM | Last Updated on Fri, Oct 14 2022 1:10 PM

Syed Mushtaq Ali T20: Prithvi Shaw Century-134 Runs-61-Balls Vs Assam - Sakshi

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో భాగంగా ముంబై కెప్టెన్‌ పృథ్వీ షా సెంచరీతో చెలరేగాడు. శుక్రవారం ఎలైట్‌ గ్రూఫ్‌-ఏలో భాగంగా అస్సాంతో మ్యాచ్‌లో ఈ ముంబై ఓపెనర్‌ శతకం సాధించాడు. 61 బంతుల్లోనే 13 ఫోర్లు, 9 సిక్సర్లతో 134 పరుగులు బాదాడు. ఫలితంగా ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ముంబై చేసిన 230 పరుగుల్లో 134 పరుగులు పృథ్వీ షావే ఉన్నాయంటే అతని విధ్వంసం ఎంతలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. యశస్వి జైశ్వాల్‌ 42 పరుగులతో పృథ్వీకి సహకరించాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ 15, శివమ్‌ దూబే 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అస్సాం బౌలర్లలో రియాన్‌ పరాగ్‌, రోషన్‌ అస్లామ్‌, రాజ్‌కుద్దీన్‌ అహ్మద్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

ఇక మ్యాచ్‌లో 134 పరుగులు నాటౌట్‌గా నిలిచిన పృథ్వీ షా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో శ్రేయాస్‌ అయ్యర్‌ 147 పరుగులు, పునిత్‌ బిస్త్‌ 146 నాటౌట్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌ 137 నాటౌట్‌ వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 

చదవండి: 'భయపడితే పనులు కావు.. పరుగులు చేయడమే'

గంగూలీపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement