Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఐదో శతకం నమోదైంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ ఐపీఎల్‌లో మెయిడెన్ సెంచరీ నమోదు చేశాడు. 61 బంతుల్లో శతకం మార్క్ అందుకున్న ప్రబ్‌సిమ్రన్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేసినప్పటికి బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రబ్‌సిమ్రన్ ఒంటరిగా పోరాడాడు. ఒకవైపు వికెట్లు కోల్పోతున్నా తాను మాత్రం స్థిరంగా ఆడి సెంచరీ మార్క్ సాధించాడు.
ఈ సీజన్‌లో ప్రబ్‌సిమ్రన్‌ది ఐదో శతకం కాగా.. ఇంతకముందు వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్), యశస్వి జైశ్వాల్(రాజస్తాన్ రాయల్స్), హ్యారీ బ్రూక్(ఎస్‌ఆర్‌హెచ్), సూర్యకుమార్ యాదవ్(ముంబై ఇండియన్స్) సెంచరీలు బాదారు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో పిన్న వయసులో సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో ప్రబ్‌సిమ్రన్ సింగ్ చోటు సంపాదించాడు. 22 ఏళ్ల 276 రోజుల్లో ప్రబ్‌సిమ్రన్ ఐపీఎల్‌లో సెంచరీ నమోదు చేశాడు.
𝙋𝙧𝙖𝙗𝙝 𝙧𝙖𝙖𝙠𝙝𝙖 🔥
— JioCinema (@JioCinema) May 13, 2023
Maiden #TATAIPL 💯 for @prabhsimran01 🦁 to give @PunjabKingsIPL an edge in this crucial match!#EveryGameMatters #DCvPBKS #TATAIPL #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/hicf7UINCM
Comments
Please login to add a commentAdd a comment