ఇంగ్లండ్‌తో మూడో టి20లో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో మెరిశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సూర్యకుమార్ శతకంతో ఆకట్టుకున్నాడు. 49 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సూర్య సెంచరీ మార్క్ అందుకున్నాడు. టి20ల్లో సూర్యకుమార్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లియామ్ లివింగ్‌స్టోన్(29 బంతుల్లో 4 సిక్సర్లతో 42 పరుగులు నాటౌట్) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక లక్ష్య చేధనలో భాగంగా టాప్-3 బ్యాట్స్‌మన్(రోహిత్ 11, పంత్ 1, కోహ్లి 11) విఫలం కాగా.. శ్రేయాస్ అయ్యర్(28 పరుగులు)ను ఒక ఎండ్‌లో ఉంచి సూర్యకుమార్ సూపర్ బ్యాటింగ్ కనబరిచాడు. వీరిద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఇక విజయం ఖాయమనుకుంటున్న తరుణంలో టీమిండియా మరోసారి తడబడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇక 117 పరుగులు చేసిన సూర్యకుమార్ మొయిన్ అలీ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. చివరకు టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడు టి20ల సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలుచుకుంది.
💯
— BCCI (@BCCI) July 10, 2022
A magnificent CENTURY from @surya_14kumar 👏👏
His first in international cricket!
Live - https://t.co/hMsXyHNzf8 #ENGvIND pic.twitter.com/LwZVee9Ali
Comments
Please login to add a commentAdd a comment