Gustav McKeon Becomes Youngest Player To Score A T20I Century, Creates Record - Sakshi
Sakshi News home page

Gustav McKeon T20 Century: టీ20ల్లో ఫ్రాన్స్ ఓపెనర్‌ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!

Published Tue, Jul 26 2022 12:22 PM | Last Updated on Tue, Jul 26 2022 1:44 PM

Gustav McKeon becomes youngest mens player to score a T20I century - Sakshi

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఫ్రాన్స్ ఓపెనర్ గుస్తావ్ మెక్‌కీన్ అరుదైన ఘనత సాధించాడు.  టీ20 ప్రపంచకప్-2024 యూరప్ క్వాలిఫయర్ గ్రూప్ బి రౌండ్‌లో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెక్‌కీన్ సెంచరీతో మెరిశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ సాధించిన అతి  పిన్న వయస్కుడుగా మెక్‌కీన్ రికార్డు సృష్టించాడు. కేవలం 18 ఏళ్ల 280 రోజుల వయస్సులోనే మెక్‌కీన్ ఈ ఘనత సాధించాడు.

అంతకు ముందు ఈరికార్డు ఆఫ్ఘనిస్తాన్‌ ఓపెనర్‌ హజ్రతుల్లా జజాయ్‌ పేరిట ఉండేది. జజాయ్‌ 20 ఏళ్ల 337 రోజుల వయస్సులో సెంచరీ సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌లో మెక్‌కీన్ జజాయ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌కీన్ 61 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు,9 సిక్స్‌లు ఉన్నాయి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఫ్రాన్స్‌పై స్విట్జర్లాండ్‌ ఒక్క వికెట్‌ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫ్రాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఫ్రాన్స్‌ బ్యాటర్లలో మెక్‌కీన్(109) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్‌ 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్విట్జర్లాండ్‌ బ్యాటర్లలో నజీర్‌(67), నయ్యర్‌(48) పరుగులతో రాణించాడు.
చదవండిRohit Sharma Latest Photo: వెస్టిండీస్‌కు చేరుకున్న టీమిండియా కెప్టెన్‌.. పంత్‌, డీకేతో పాటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement