International T-20 matches
-
టీ20ల్లో ఫ్రాన్స్ ఓపెనర్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఫ్రాన్స్ ఓపెనర్ గుస్తావ్ మెక్‌కీన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ప్రపంచకప్-2024 యూరప్ క్వాలిఫయర్ గ్రూప్ బి రౌండ్లో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెక్‌కీన్ సెంచరీతో మెరిశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడుగా మెక్‌కీన్ రికార్డు సృష్టించాడు. కేవలం 18 ఏళ్ల 280 రోజుల వయస్సులోనే మెక్‌కీన్ ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు ఈరికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ పేరిట ఉండేది. జజాయ్ 20 ఏళ్ల 337 రోజుల వయస్సులో సెంచరీ సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌లో మెక్‌కీన్ జజాయ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌కీన్ 61 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు,9 సిక్స్‌లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫ్రాన్స్‌పై స్విట్జర్లాండ్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫ్రాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఫ్రాన్స్ బ్యాటర్లలో మెక్‌కీన్(109) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్విట్జర్లాండ్ బ్యాటర్లలో నజీర్(67), నయ్యర్(48) పరుగులతో రాణించాడు. చదవండి: Rohit Sharma Latest Photo: వెస్టిండీస్‌కు చేరుకున్న టీమిండియా కెప్టెన్.. పంత్, డీకేతో పాటు -
4 బంతుల్లో 4 వికెట్లు
పుష్కర కాలం క్రితం 2007 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో లసిత్ మలింగ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లుతీసి అరుదైన సంచలనాన్ని నమోదు చేశాడు. ‘హ్యాట్రిక్’తోనే సరిపెట్టకుండా తర్వాతి బంతికి మరో వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకొని అద్భుతం చేసి చూపించాడు. ఇప్పుడు అదే ఫీట్‌ను అతను పునరావృతం చేశాడు. ఈసారి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో తన సత్తా చూపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీసి మరెవరికీ సాధ్యం కాని రీతిలో చరిత్రకెక్కాడు. మలింగ దెబ్బకు కివీస్ చిత్తుగా ఓడగా... సొంతగడ్డపై తన కెప్టెన్సీలో సిరీస్ క్లీన్‌స్వీప్ కాకుండా అతను కాపాడుకోగలిగాడు. పల్లెకెలె: న్యూజిలాండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లు ఓడి ఇప్పటికే టి20 సిరీస్ కోల్పోయిన శ్రీలంక మూడో మ్యాచ్‌లో కూడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసి మరో ఓటమికి సిద్ధమైనట్లు కనిపించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదటి 2 ఓవర్లలో కివీస్ 15 పరుగులు చేసింది. ఇక ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోవచ్చని అనిపించిన సమయంలో అసలు తుఫాన్ మొదలైంది. మూడో ఓవర్ తొలి రెండు బంతులకు పరుగులు ఇవ్వని మలింగ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. తర్వాతి 4 బంతుల్లో 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మలింగ తర్వాతి ఓవర్లో సీఫెర్ట్ కూడా వెనుదిరగడంతో అతని బౌలింగ్ విశ్లేషణ 5/5గా నిలిచింది. ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్ వేసి మరో పరుగు ఇచ్చిన మలింగ మ్యాచ్‌ను 4–1–6–5తో ముగించాడు. కివీస్ 88 పరుగులకే కుప్పకూలి 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 4 వికెట్లు పడ్డాయిలా... 2.3: మున్రో (బి) మలింగ 2.4: రూథర్‌ఫోర్డ్ (ఎల్బీ) మలింగ– రివ్యూలోనూ అవుట్ 2.5: గ్రాండ్‌హోమ్ (బి) మలింగ – హ్యాట్రిక్ పూర్తి 2.6: టేలర్ (ఎల్బీ) మలింగ పాపం రూథర్‌ఫోర్డ్... కివీస్ ప్లేయర్ హామిష్ రూథర్‌ఫోర్డ్ 2013లో ఇదే మైదానంలో తన చివరి టి20 మ్యాచ్ ఆడాడు. మూడో మ్యాచ్‌కు ముందు గప్టిల్ గాయపడటంతో ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న అతడిని హడావిడిగా బుధవారమే జట్టులోకి ఎంపిక చేశా రు. అదే రోజు సాయంత్రం బయల్దేరి దాదాపు 9 వేల కిలోమీటర్లు ప్రయాణించి బరిలోకి దిగిన రూథర్‌ఫోర్డ్ తొలి బంతికే అవుటయ్యాడు పాపం. 5: అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్ మలింగ. అతను వన్డేల్లో 3, టి20ల్లో 2 హ్యాట్రిక్‌లు సాధించాడు. 1: అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్ మలింగ (మొత్తం 104) 100: అన్ని ఫార్మాట్లు కలిపి అంతర్జాతీయ క్రికెట్లో ఇది 100వ హ్యాట్రిక్ 2: టి20ల్లో మలింగకు ముందు రషీద్ ఖాన్ (అఫ్గాన్) కూడా 4 బంతుల్లో 4 వికెట్లు (ఐర్లాండ్‌పై) తీశాడు. -
టి20ల్లో థాయ్ అమ్మాయిల ప్రపంచ రికార్డు
దుబాయ్: థాయ్‌లాండ్ మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ టి20ల్లో కొత్త రికార్డు సృష్టించింది. వరుసగా 17వ విజయంతో ఆసీస్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న నాలుగు దేశాల టి20 టోర్నీలో థాయ్ జట్టు ఆతిథ్య జట్టును 54 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం స్వల్పలక్ష్యాన్ని కేవలం 8 ఓవర్లలోనే ఛేదించింది. ఇది థాయ్‌లాండ్ అమ్మాయిలకు వరుసగా 17వ విజయం. ఈ నాలుగు దేశాల టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్ మిగతా జట్లు... కాగా గత ఏడాది జూలైలో యూఏఈని ఓడించడం ద్వారా థాయ్‌లాండ్ జైత్రయాత్ర మొదలైంది. ఇప్పటి వరకు ఆసీస్ మహిళలు 2014–15 సీజన్లో 16 వరుస విజయాలతో రికార్డు సృష్టించగా ఇప్పుడు థాయ్ జట్టు ఆ రికార్డును చెరిపేసింది. అత్యధిక వరుస విజయాల జాబితాలో థాయ్, ఆసీస్ తర్వాత ఇంగ్లండ్, జింబాబ్వే మహిళల జట్లు 14 విజయాలతో నిలువగా, న్యూజిలాండ్ 12 విజయాలతో టాప్–5లో ఉంది. -
టి20ల నుంచి ధోని ఔట్
పుణే: భారత జట్టుకు తొలి టి20 ప్రపంచకప్‌ను అందించిన మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ టి20 కెరీర్ ముగిసినట్లేనా! వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టి20 సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో ధోనికి చోటు ఇవ్వకుండా సెలక్టర్లు పరోక్షంగా తమ ఉద్దేశాన్ని చెప్పేశారా. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం రాత్రి ఆలస్యంగా నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించింది. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే టి20 సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక నాలుగు టెస్టుల సిరీస్, టి20 సిరీస్‌లకు జట్లను ఎంపిక చేసింది. దీనికి తోడు టెస్టు జట్టులోని ప్రధాన ఆటగాళ్లతో కూడిన ‘ఎ’ టీమ్‌ను న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే తొలి అనధికారిక టెస్టు కోసం వెల్లడించారు. ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో చోటు కోల్పోయిన మురళీ విజయ్, అంతకుముందే స్థానం లేని రోహిత్ శర్మ, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఎంపిక ఆసీస్‌తో సిరీస్‌కు అనూహ్య నిర్ణయాలు. వరుసగా రెండు టి20 సిరీస్‌లకు ధోనిని పక్కన పెట్టడం అంటే విశ్రాంతిగా భావించలేం కాబట్టి అతను ఇక వన్డేలకే పరిమితమైనట్లని చెప్పవచ్చు. ఆయా జట్లలో ఉన్న రెగ్యులర్ ఆటగాళ్లను మినహాయించి శుక్రవారం ఎంపికలో చోటు చేసుకున్న కీలక మార్పులను చూస్తే... కోహ్లికి మళ్లీ విశ్రాంతి... వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే మూడు టి20ల సిరీస్‌కు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. అతని స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఉన్న ఆటగాళ్లు మినహా కొత్తగా అవకాశం దక్కినవారిని చూస్తే... విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా ఆడిన జార్ఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ తొలిసారి జట్టులోకి ఎంపికయ్యాడు. గతంలో టీమ్‌లోకి ఎంపికైనా మ్యాచ్ దక్కని కృనాల్ పాండ్యాకు మరో చాన్స్ లభించింది. భారత్ తరఫున చెరో 6 టి20లు ఆడిన శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌లను కూడా తీసుకున్నారు. వన్డేల్లో స్థానం కోల్పోయిన దినేశ్ కార్తీక్‌ను కూడా ఎంపిక చేయడం మరో ఆశ్చర్యకర నిర్ణయం. మరోవైపు ఫిట్నెస్ సమస్యలతో గురువారం ఎంపిక చేయలేదని ప్రకటించిన కేదార్ జాదవ్‌ను నాలుగు, ఐదు వన్డేల కోసం టీమ్‌లోకి తీసుకోవడం విశేషం. ఆసీస్‌తో టి20లకు రెడీ... విండీస్ సిరీస్ అనంతరం కోహ్లి మళ్లీ భారత జట్టుతో చేరతాడు. ఆస్ట్రేలియాతో నవంబర్ 21నుంచి ప్రారంభమయ్యే టి20 సిరీస్‌కు అతను నాయకత్వం వహిస్తాడు. విండీస్‌తో సిరీస్‌కు ఎంపికైన షాబాజ్ నదీమ్‌కు ఇందులో చోటు దక్కలేదు. ఇది మినహా మరే మార్పు లేదు. విహారికి చోటు... ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో సెలక్షన్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంగ్లండ్‌లో రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యం తర్వాత స్థానం కోల్పోయిన ఓపెనర్ మురళీ విజయ్ను మళ్లీ ఎంపిక చేసింది. చోటు కోల్పోయిన తర్వాత విజయ్ కౌంటీల్లో ఎసెక్స్ తరఫున ఆడిన 5 ఇన్నింగ్స్‌లలో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత విజయ్ హజారే టోర్నీలో 3, 44, 24 పరుగులు సాధించాడు. అయితే సొంతగడ్డపై విండీస్‌తో టెస్టులకు ఎంపిక కాని శిఖర్ ధావన్‌పై మాత్రం సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. దాంతో అతనికి అవకాశం దక్కలేదు. టెస్టుల్లో రోహిత్ శర్మ పునరాగమనం మాత్రం పూర్తిగా అతని వన్డే, టి20 ఫామ్‌ను చూసే జరిగిందని చెప్పవచ్చు. దక్షిణాఫ్రికా గడ్డపై రెండు టెస్టుల్లో 10, 47, 11, 10 పరుగులు చేసిన తర్వాత మూడో టెస్టుకు దూరమై ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక కాని రోహిత్ ఆ తర్వాత ఎలాంటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడలేదు. ఆసియా కప్‌లో జట్టును గెలిపించిన అనంతరం విజయ్ హజారేలో రెండు వన్డేలు, విండీస్‌తో మరో రెండు వన్డేలు ఆడాడు. పంత్ ప్రధాన కీపర్‌గా ఎదగగా... సాహా గాయం నుంచి కోలుకోకపోవడంతో సెలక్టర్లు మళ్లీ వెటరన్ పార్థివ్ పటేల్‌కే తమ ఓటు వేశారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రెండు టెస్టులు ఆడిన అనంతరం అతను ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వచ్చింది. 2003–04 సిరీస్‌లోనే ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన పార్థివ్ ఇప్పుడు జట్టులో అక్కడి అనుభవంరీత్యా అందరికంటే సీనియర్ కానున్నాడు! విండీస్‌తో సిరీస్‌లో జట్టులో ఉన్నా మ్యాచ్ దక్కని ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి కూడా ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లభించింది. ఐదుగురు ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేశ్ యాదవ్లకే కట్టుబడిన సెలక్టర్లు అశ్విన్, జడేజాలతో పాటు మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ను కూడా ఎంపిక చేయడం విశేషం. ప్రాక్టీస్ కోసం ముందుగా... ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే తొలి నాలుగు రోజుల మ్యాచ్ కోసం భారత్ ‘ఎ’ జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు. అయితే మ్యాచ్ ప్రాక్టీస్ కోసం టెస్టు జట్టులో భాగంగా ఉన్న పలువురు ఆటగాళ్లను ఇందులోకి ఎంపిక చేశారు. రహానే కెప్టెన్సీలో విజయ్, పృథ్వీ షా, విహారి, రోహిత్, పార్థివ్ ఈ మ్యాచ్ ఆడనున్నారు. టెస్టుల్లో స్థానం ఆశించిన మయాంక్ అగర్వాల్‌కు ఇక్కడ మాత్రం చోటు లభించింది. హైదరాబాద్ పేసర్ సిరాజ్, ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ కూడా ఈ జట్టులో ఉన్నారు. భారత్ జట్టు 2006 నుంచి ఇప్పటి వరకు 104 టి20 మ్యాచ్‌లు ఆడితే 93 మ్యాచ్‌లలో ధోని భాగంగా ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ధోనికి ఒకే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. విండీస్‌తో, ఆస్ట్రేలియాతో జరిగే టి20ల్లో ధోని ఆడబోవడం లేదు. మేం రెండో వికెట్ కీపర్‌ను పరీక్షించే ప్రయత్నంలో ఉన్నాం. ఈ విషయంలో పంత్, కార్తీక్ పోటీ పడతారు. అయితే టి20ల్లో ధోని కెరీర్ ముగిసిందని మాత్రం చెప్పలేను. –ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్ ఆసీస్‌తో టెస్టులకు జట్టు: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పృథ్వీ షా, పుజారా, రహానే, విహారి, రోహిత్, పంత్, పార్థివ్, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్, ఉమేశ్, బుమ్రా, భువనేశ్వర్. న్యూజిలాండ్ ‘ఎ’తో మ్యాచ్‌కు భారత్ ‘ఎ’ జట్టు: రహానే (కెప్టెన్), విజయ్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, విహారి, రోహిత్, పార్థివ్, కృష్ణప్ప గౌతమ్, షాబాజ్ నదీమ్, సిరాజ్, నవదీప్ సైనీ, దీపక్ చహర్, రజనీశ్ గుర్బానీ, విజయ్ శంకర్, కేఎస్ భరత్. వెస్టిండీస్‌తో టి20లకు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రాహుల్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, శ్రేయస్, పంత్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్, షాబాజ్ నదీమ్. (నదీమ్ మినహా మిగతా జట్టును ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌కు ఎంపిక చేశారు. విశ్రాంతి అనంతరం విరాట్ కోహ్లి మళ్లీ కెప్టెన్సీ చేపడతాడు) రోహిత్ శర్మ, విజయ్ -
మన ఆట...మన దగ్గర.... మనమే గెలవాలి
► రేపటి నుంచి టి20 ప్రపంచకప్ ► బరిలో 10 జట్లు ► తొలి మ్యాచ్లోన్యూజిలాండ్తో భారత్ ఢీ పొట్టి క్రికెట్ పుట్టింది ఇంగ్లండ్‌లో కావచ్చు... కానీ దానికి పరుగు నేర్పింది మనమే. తొలి ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవడం వల్ల ఈ ఫార్మాట్‌కు ఊహించని స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు. ఫలితంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుట్టింది. ఆట రాత మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి క్రికెటర్ ఈ లీగ్‌లో ఆడాలని తహతహలాడుతున్నాడు. భారత్‌లో ఆడాలని కలలుగంటున్నాడు. కానీ వాళ్లలో అందరికీ అవకాశం లేదు. ఎంతోమంది విదేశీ క్రికెటర్లు తమ దేశాల్లో స్టార్లే అయినా భారత్‌లో వారి ప్రదర్శన చూపించే అవకాశం రాలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ విదేశీ స్టార్స్ అంతా భారత గడ్డపై సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. ధనాధన్ క్రికెట్‌ను దత్తత తీసుకున్న భారత గడ్డ మీద తొలిసారి విశ్వ సంరంభం జరగబోతోంది. ఐపీఎల్ వల్ల ఈ ఫార్మాట్ మనకే సొంతంలా మారిపోయింది. ఐదు కప్‌ల నిరీక్షణ తర్వాత... తొలిసారి మనం ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చింది. ఐపీఎల్ ద్వారా ఎంత వినోదం లభించినా... భారత అభిమానులు కోరుకునేది మాత్రం మువ్వన్నెల రెపరెపలే. సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిస్తే ఆ కిక్కే వేరు. అలాంటి మజాను అందించే అవకాశం ధోని సేనకు లభించింది. ఐపీఎల్‌ను ఆదరించి క్రికెటర్ల జేబుల్లో కోట్లు నిండటానికి కారణమైన అభిమానుల రుణం తీర్చుకునే అవకాశం లభించింది. అందుకే... భారత్ గెలవాలి... గెలిచి తీరాలి. నాగ్‌పూర్ నుంచి సాక్షి క్రీడాప్రతినిధి భారతదేశంలో ఐపీఎల్ రూపంలో కొన్ని వందల మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఇప్పటివరకూ ఇక్కడ జరిగిన అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు కేవలం 15 మాత్రమే. అందుకే భారత అభిమానుల్లో ఏదో ఓ చిన్న వెలితి. ఆ కరువు తీరుస్తూ అసలైన ధనాధన్ క్రికెట్ పండుగ మన దేశానికి వచ్చేసింది. ఆరో టి20 ప్రపంచకప్‌కు రేపు (మంగళవారం) తెరలేవనుంది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల రూపంలో ఇప్పటికే కొంత వినోదం లభించినా... అసలు సిసలు పోరు ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. భారత్, న్యూజిలాండ్‌ల మధ్య నాగ్‌పూర్‌లో జరిగే మ్యాచ్‌తో ఆరంభమయ్యే ఈ టోర్నీ... ఏప్రిల్ 3న కోల్‌కతాలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం ఏడు వేదికల్లో 23 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీతో సమాంతరంగా మహిళలకు కూడా టి20 ప్రపంచకప్ జరుగుతుంది. పురుషుల విభాగంలో ఎనిమిది ప్రధాన జట్లు నేరుగా టోర్నీలో బరిలోకి దిగుతుండగా... క్వాలిఫయింగ్ మ్యాచ్ ల ద్వారా బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ అర్హత సాధించాయి. మొత్తం పది జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడతాయి. రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరతాయి. ఎవరూ తక్కువ కాదు ప్రపంచకప్‌లో పోటీ పడుతున్న మిగతా జట్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల లేదా మంచి స్పిన్నర్లు ఉన్న జట్టే ముందుకు వెళ్లవచ్చు. వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్లు ఉన్నా వారు ఇక్కడ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఇక వివిధ జట్ల బ్యాటింగ్ సామర్థ్యాన్ని చూస్తే మరోసారి ఐపీఎల్ ప్రదర్శనే కీలకంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా క్రికెట్ ఆడిన ఆటగాళ్లు ఉన్న జట్లది కాస్త పైచేయిగా కనిపించవచ్చు. వ్యక్తిగతంగా కూడా ఆయా క్రికెటర్ల సత్తాను బట్టే టీమ్‌ను ఏవైనా సంచలనాలు ఆశించవచ్చు. ఆస్ట్రేలియా: లోటు తీరేనా? ఒక్కసారి కూడా టి20 ప్రపంచకప్ గెలవలేకపోయిన ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. వార్నర్, వాట్సన్, మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌తో ఫలితాన్ని మార్చగలరు. స్పిన్‌ను బాగా ఆడగల స్మిత్ కెప్టెన్సీ నైపుణ్యం కూడా ఆ జట్టుకు అనుకూలాంశం. ఆల్‌రౌండర్‌గా ఫాల్క్‌నర్ కీలకం కానున్నాడు. సుదీర్ఘ కాలంగా టి20లను పట్టించుకోకుండా ఎక్కువ మ్యాచ్‌లు ఆడని ఆసీస్‌కు అదే సమస్యగా మారింది. భారత్ చేతిలో సొంతగడ్డపై పరాజయానికి అది కూడా కారణం. తాజాగా దక్షిణాఫ్రికాపై టి20 సిరీస్ గెలవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దక్షిణాఫ్రికా: అదృష్టం కలిసొస్తే... జట్టులో ఏకంగా 11 మందికి ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. ఇది సఫారీలకు చెప్పుకోదగ్గ అనుకూలత. ఎక్కువ మంది ఆల్‌రౌండర్లతో టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఆసీస్ చేతిలో సిరీస్ ఓడినా... అంతకుముందు భారత్‌లోనే 2-0తో గెలవడం ఆ జట్టు సామర్థ్యానికి సూచిక. డివిలియర్స్ దూకుడును ఆపాలంటే బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సిందే. డు ప్లెసిస్, డుమిని, డేవిడ్ మిల్లర్, డి కాక్, డేవిడ్ వీస్... ఇలా ‘డి’ గ్యాంగ్ మొత్తానికి టి20ల్లో మంచి హిట్టర్లుగా గుర్తింపు ఉంది. ఐపీఎల్-2016 కోసం భారీ మొత్తానికి అమ్ముడుపోయిన క్రిస్ మోరిస్ ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే స్టెయిన్‌లో జోరు తగ్గడం, ఇమ్రాన్ తాహిర్ మినహా నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం.. పెద్ద టోర్నీల్లో కీలక మ్యాచ్‌ల్లో తడబడే నేపథ్యం ఈ జట్టు బలహీనత. ఇంగ్లండ్: అనుభవజ్ఞులు లేకున్నా... ఈ మాజీ చాంపియన్ ఇటీవలి కాలంలో బాగా పుంజుకుంది. సాంప్రదాయాన్ని వదిలి ఫార్మాట్‌కు అనుగుణంగా కుర్రాళ్లను, కొత్త తరాన్ని ప్రోత్సహిస్తుండటంతో జట్టు నిలకడగా మంచి ఫలితాలు సాధిస్తోంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు మినహా మరే ఆటగాడికి భారత గడ్డపై ఆడిన కనీస అనుభవం కూడా లేదు. వన్డేల్లో ఏడాది వ్యవధిలో మూడు వేగవంతమైన సెంచరీలు నమోదు చేసిన జోస్ బట్లర్ ప్రభావం చూపగల క్రికెటర్. స్పిన్ ఆల్‌రౌండర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌లపై ఇంగ్లండ్ భారీగా ఆశలు పెట్టుకుంది. న్యూజిలాండ్: సత్తా చాటేనా? భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో కచ్చితంగా ముద్ర వేస్తాడనుకున్న బ్రెండన్ మెకల్లమ్ అనూహ్య రిటైర్మెంట్తో షాక్ ఇచ్చాడు. గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలో కూడా సత్తా చాటిన కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌పై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. విలియమ్సన్, రాస్ టేలర్ మాత్రం స్పిన్‌ను బాగా ఆడగలరు. మున్రోతో పాటు లోయర్ ఆర్డర్లో అండర్సన్, ఇలియట్ కీలకం కానున్నారు. బౌల్ట్ మినహా గుర్తింపు ఉన్న బౌలర్ జట్టులో లేడు. స్పిన్నర్లు నాథన్ మెకల్లమ్, సాన్ ్టనర్, సోధి ఏ మాత్రం ప్రభావం చూపిస్తారనేది సందేహమే. వెస్టిండీస్: మళ్లీ జి‘గేల్’మనాలని... ఒక్కడున్నను చాలు గేల్‌లాంటి ఆటగాడు. వంద మంది బలగమేల...’ అన్నట్లు వెస్టిండీస్ జట్టు కనిపిస్తోంది. డ్వేన్ బ్రేవో, రసెల్, స్యామీ, శామ్యూల్స్లాంటి ఆల్‌రౌండర్లు ఉన్నా... ఈ టోర్నీలో గేల్ చూపించగలిగే ప్రభావమే వేరు. నిజంగా గేల్ తనదైన శైలిలో చెలరేగితే ఇతర ఆటగాళ్లంతా పక్క వాయిద్యగాళ్లే. కాబట్టి విండీస్ విజయమైనా, పరాజయమైనా గేల్‌పైనే అమితంగా ఆధారపడి ఉన్నాయి. గేల్ విఫలమైన చోట 99 శాతం సందర్భాల్లో జట్టు కూడా కుప్పకూలింది. బ్రేవో, రసెల్‌లకు కూడా ఐపీఎల్ అనుభవం బాగుంది. శ్రీలంక: ఇకనైనా పురోగమించేనా? ఇక డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తోంది. కుమార సంగక్కర, మహేల జయవర్ధనేల రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టులో కనీసం ప్రదర్శన ఇవ్వగల ఆటగాళ్లు కరువయ్యారు. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన తీరు లంక తిరోగమనానికి పరాకాష్ట. ఫామ్‌పరంగా చూస్తే చండీమల్, రంగన హెరాత్ మాత్రమే కాస్త మెరుగ్గా కనిపిస్తున్నారు. ఒకప్పుడు టాప్ క్లాస్ ఆల్‌రౌండర్‌గా కనిపించిన మ్యాథ్యూస్ ఇప్పుడు ఎందులోనూ రాణించలేక నిస్సహాయంగా కనిపిస్తున్నాడు. ఇక మలింగ యార్కర్లపై నమ్మకమున్నా, అతను ఏ మ్యాచ్‌లో ఆడతాడో చెప్పలేని పరిస్థితి. ఓవరాల్‌గా లంక జట్టును మాత్రం ఎవరూ గట్టి ప్రత్యర్థిగా భావించడం లేదు. బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ ఇటీవల ఆసియాకప్‌లో ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్‌ను ఏ ప్రత్యర్థీ తక్కువ అంచనా వేయడానికి లేదు. పాకిస్తాన్, శ్రీలంకలాంటి జట్లను ఆసియాకప్‌లో ఓడించిన బంగ్లాదేశ్... టి 20 ర్యాంకింగ్స్ కారణంగా క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. షకీబ్, మొర్తజా, తమీమ్ ఒకే ఓవర్లో ఫలితాన్ని మార్చగల సమర్థులు. ఇటీవల బంగ్లా జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక అఫ్ఘానిస్తాన్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. 2010 నుంచి ప్రతి టి20 ప్రపంచకప్‌లోనూ ఆడుతున్న ఈ జట్టు ఇటీవల జింబాబ్వేపై సిరీస్ గెలిచింది. అలాగే అర్హత మ్యాచ్‌ల్లోనూ ఎదురైన ప్రతి ప్రత్యర్థినీ చిత్తు చేసింది. ఈ రెండు జట్లు సెమీస్‌కు చేరడం కష్టమే అయినా... ఏదో ఒక సంచలనం సృష్టించగల సత్తా ఉంది. పాకిస్తాన్: అంతంత మాత్రమే... భారత్‌తో మళ్లీ ఓడతామనే భయంతోనే ఆడేందుకు జంకుతున్నారు... ఇటీవల పరిణామాల సందర్భంలో వినిపించిన జోక్ ఇది. ఇది జోకే అయినా పాకిస్తాన్ జట్టు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ చేతిలోనూ ఓడి, యూఏఈతో అదృష్టవశాత్తూ బయటపడిన ఆ జట్టు సామర్థ్యంపై పెద్దగా నమ్మకం లేదు. ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ బాగా బలహీనం. ఒక్క బ్యాట్స్‌మన్ కూడా గట్టిగా నిలబడి మ్యాచ్‌ను శాసిస్తాడని చెప్పే పరిస్థితే లేదు. ఆ జట్టు ఎన్నో కొన్ని విజయాలు సాధిస్తోందీ అంటే బౌలింగ్‌ను నమ్ముకునే. ఫామ్‌ను చూస్తే ఆమిర్ మళ్లీ కీలకం కానున్నాడు. ఉపఖండపు జట్టే అయినా నాణ్యమైన స్పిన్నరే లేడు. ఆటగాడిగాకంటే పీసీబీ రాజకీయాలతోనే కెప్టెన్‌గా సాగుతున్న షాహిద్ ఆఫ్రిది అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో దేనికీ పనికి రావడం లేదు. అనుభవం పరంగా చూస్తే ఈ టోర్నీలో పాక్ తరఫున కాస్తయినా పరువు నిలబెట్టగల ఆటగాడిగా ఒక్క షోయబ్ మాలిక్ మాత్రమే కనిపిస్తున్నాడు.