Pakistan Super League (PSL) 2023: Lahore Qalandars Beat Islamabad United By 119 Runs - Sakshi
Sakshi News home page

PSL 2023: ఫఖర్‌ జమాన్‌ వీరవిహారం.. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ జోరు

Published Fri, Mar 10 2023 8:37 AM | Last Updated on Fri, Mar 10 2023 9:12 AM

Fakhar Zaman 57 Balls-115 Runs-Lahore Qalandars Won-By 119 Runs - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) 8వ సీజన్‌లో లాహోర్‌ ఖలండర్స్‌ తన జోరు కొనసాగిస్తుంది. గత మ్యాచ్‌లో ఓటమిని మరిచిపోయేలా ఇస్లామాబాద్‌ యునైటెడ్‌పై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఖలండర్స్‌ ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ 57 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్‌ బిల్లింగ్స్‌ 22 బంతుల్లో 32 పరుగులు చేయగా.. చివర్లో రషీద్‌ ఖాన్‌ 5 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 15 పరుగులు బాదాడు. 

అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ స్పిన్‌ మాయాజాలానికి ఇస్లామాబాద్‌ తోక ముడిచింది. జట్టులో అ‍త్యధిక స్కోరు 18 పరుగులే కావడం గమనార్హం. బౌలర్ల ధాటికి ఇస్లామాబాద్‌ 15.1 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. రషీద్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు తీయగా.. హారిస్‌ రౌఫ్‌, జమాన్‌ ఖాన్‌లు తలా రెండు వికెట్లు తీశారు. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, రెండు పాయింట్లతో ఉన్న లాహోర్‌ ఖలండర్స్‌ దాదాపు సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంది.

చదవండి: మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement