పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్ 2022)లో లాహోర్ ఖలందర్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన ఫైనల్లో లాహోర్ ఖలందర్స్ 42 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. ఇక ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు ఫఖర్ జమాన్ లీగ్‌లో 588 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి బ్యాటర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.
విషయంలోకి వెళితే.. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఖలందర్స్ ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న ఫఖర్ జమాన్ ప్రేక్షకుల వైపు తిరిగాడు. ఇదే సమయంలో ఇద్దరు అభిమానులు ఫఖర్ జమాన్‌ను కవర్ చేస్తూ ఒక సెల్ఫీ తీసుకున్నారు. తాజాగా ఆ ఫోటోను జమాన్ స్వయంగా తన ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ''మిమ్మల్ని ఈ విధంగా కలవడం ఆనందంగా ఉంది.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. అయితే అది లాంగ్‌షాట్ కావడంతో ఫఖర్ నిజంగా సెల్ఫీ ఇచ్చాడా లేదా అన్నది క్లియర్‌గా తెలియడం లేదు. దీంతో అభిమానులు ట్రోల్స్ వర్షం కురిపించారు. ''అసలు ఎటు తిరిగి ఉన్నాడో అర్థం కాలేదు.. ఇదేం సెల్ఫీ'' అంటూ కామెంట్ చేశారు.
చదవండి: Ind Vs SL 1st Test: ఒక్కరు కూడా సరైన ప్రశ్నలు వేయడం లేదు: రోహిత్ శర్మ
IND VS SL 1st Test: అంతా కోహ్లినే చేశాడు.. హిట్‌మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
It was nice to meet you 😆 https://t.co/vPxWvjqbmq
— Fakhar Zaman (@FakharZamanLive) March 3, 2022
Comments
Please login to add a commentAdd a comment