డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ విధ్వంసకర సెంచరీతో కదం తొక్కాడు. ప్రధాన ఆటగాళ్లు దూరం కావడంతో తనకు వచ్చిన అవకాశాలను శాంసన్ రెండు రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.
గత నెలలో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌పై శివతాండవం చేసిన సంజూ.. ఇప్పుడు సఫారీ గడ్డపై బీబత్సం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుస ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు.
కేవలం 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ ఈ కేరళ స్టార్ నిలిచాడు. ఇక తన అద్బుత ఇన్నింగ్స్‌పై సంజూ శాంసన్ స్పందించాడు. ఇన్నింగ్స్ బ్రేక్‌లో బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ ఆధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో సంజూ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.
"నేను ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తే కచ్చితంగా ఎమోషనల్ అవుతాను. ఎందుకంటే ఈ క్షణం కోసమే గత 10 ఏళ్ల నుంచి వేచి ఉన్నాను. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంది నాకు సపోర్ట్‌గా నిలిచారు.
నా కష్టానికి తగ్గ ఫలితం ఇన్నాళ్లకు దక్కింది. కానీ నేను గాల్లో తేలిపోవాలనుకోవటం లేదు. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇదే తరహా ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని" అని భారత్ ఇన్నింగ్స్ అనంతరం సంజూ పేర్కొన్నాడు.
"ఈ మ్యాచ్‌లో నా బ్యాటింగ్‌ను నేను అస్వాదించాను. నా ఫామ్‌ను పూర్తిగా వినిగియోగించుకున్నాను. మేము దూకుడుగా ఆడాలని ముందే నిర్ణయించుకున్నాము. మూడు నాలుగు బంతులు ఆడిన తర్వాత కచ్చితంగా బౌండరీ కోసం ప్రయత్నించాల్సిందే. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో శాంసన్ చెప్పుకొచ్చాడు.
చదవండి: IND-A vs AUS-A: తీరు మారని టీమిండియా.. ఆసీస్ చేతిలో మరో ఓటమి
Comments
Please login to add a commentAdd a comment