హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. తొలి రెండు టీ20ల్లో 29, 10 పరుగులతో నిరాశపరిచిన సంజూ.. ఆఖరి టీ20లో మాత్రంలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
బంగ్లా బౌలర్లకు శాంసన్ చుక్కులు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ కేరళ స్టార్ క్రికెటర్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111 పరుగులు చేసాడు. ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సంజూ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
శాంసన్ సాధించిన రికార్డులు ఇవే..
➔అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాల్గవ బ్యాటర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2017లో బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో మిల్లర్ సెంచరీ సాధించాడు. అదే విధంగా భారత్ తరపున ఈ ఘనత అందుకున్న రెండో ప్లేయర్‌గా శాంసన్ నిలిచాడు. ఈ లిస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ శ్రీలంకపై 35 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.
➔ఈ మ్యాచ్‌లో బంగ్లా స్పిన్నర్ రిషద్ హోస్సేన్‌ను సంజూ ఊతికారేశాడు. హోస్సేన్ వేసిన 10 ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది 30 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిక్స్‌లు పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా శాంసన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువీ ఆరు సిక్స్‌లు బాదాడు.
➔భారత్ తరఫున టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజు శాంసన్ సంజూ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోర్ 89 పరుగులు మాత్రమే. 2022లో శ్రీలంకతో జరిగిన టీ20లో ఇషాన్ కిషన్ 89 పరుగులు చేశాడు.
➔బంగ్లాదేశ్‌పై టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన భారత క్రికెటర్‌గా సంజూ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2019లో రాజ్‌కోట్ వేదికగా బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 23 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. తాజా మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు.
చదవండి: డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment