సంజూ శాంసన్.. ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచిన సంజూ.. ఒకే ఒక ఇన్నింగ్స్‌తో తనపై విమర్శల చేస్తున్న వారి నోరు మూయించాడు. తను బ్యాట్‌కు పని చెబితే ఏ విధంగా ఉంటుందో క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. బంగ్లాదేశ్‌తో తొలి రెండు టీ20ల్లో పెద్దగా రాణించకపోయిన శాంసన్.. హైదరాబాద్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఉప్పల్‌లో బంగ్లా బౌలర్లను ఈ కేరళ బ్యాటర్ ఊచకోత కోశాడు. ఓపెనర్‌గా వచ్చిన సంజూను అపడం ఎవరూ తరం కాలేదు. అతడు బౌండరీలు బాదుతుంటే ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర పోషించారు. మైదానం నలుమూలల సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు.
రోహిత్ శర్మ తర్వాత వేగవంతమైన సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు. రోహిత్ శ్రీలంకపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 47 బంతులు ఎదుర్కొన్న సంజూ 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు
ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లా స్పిన్నర్ రిషాద్ హుస్సేన్‌ను సంజూ ఊతికారేశాడు. 10 ఓవర్ వేసిన రిషాద్ బౌలింగ్‌లో వరుసగా అయిదు సిక్స్‌లు బాది అదరహో అనిపించాడు. ఈ ఓవర్ తొలి బంతిని డాట్ చేసిన సంజూ శాంసన్.. ఫుల్‌టాస్‌గా వచ్చిన రెండో బంతిని సిక్సర్‌గా తరలించాడు.
మూడో బంతిని లాంగాఫ్ దిశగా... నాలుగో బంతిని స్ట్రైట్‌గా.. ఐదో బంతిని లాంగాన్ దిశగా.. చివరి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా మలిచాడు. అతడి విధ్వంసం చూసి బంగ్లా ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Sanju Samson - you beauty!🤯#IDFCFirstBankT20ITrophy #INDvBAN #JioCinemaSports pic.twitter.com/JsJ1tPYKgD
— JioCinema (@JioCinema) October 12, 2024
Comments
Please login to add a commentAdd a comment