బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ అనంతరం అదే జట్టుతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఆక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది.
ఐపీఎల్ యువ సంచలనం మయాంక్ యాదవ్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని సెలక్టర్లు ఎంపిక చేశారు. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడేళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు.
ఓపెనర్‌గా సంజూ శాంసన్..?
ఇక ఇది ఇలా ఉండగా.. బంగ్లాతో టీ20లకు రెగ్యూలర్ ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, శుబ్‌మన్ గిల్‌కు సెలక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. ప్రస్తుతం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో అభిషేక్ శర్మ ఒక్కడే రెగ్యూలర్ ఓపెనర్‌గా ఉన్నాడు. దీంతో భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్‌తో కలిసి ప్రారభించేది ఎవరన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న.
అయితే అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా ఇన్నింగ్స్‌ను వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోంది. అతడిని ఓపెనర్‌గా ప్రమోట్ చేయాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
గతంలో ఐర్లాండ్ సిరీస్‌లో ఓసారి భారత జట్టు ఓపెనర్‌గా సంజూ బరిలోకి దిగాడు. కాగా ఈ సిరీస్ శాంసన్‌కు చాలా కీలకం. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో నిరాశపరిచినప్పటకి ఈ కేరళ స్టార్‌కు సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు. మరి ఓపెనర్‌గా ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment