IPL 2023 KKR Vs SRH: Harry Brook Said My Girlfriend Here, But Rest Of the Family Just Left - Sakshi
Sakshi News home page

Harry Brook: 'గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రమే ఇక్కడుంది.. అందరూ వెళ్లిపోయారు'

Published Fri, Apr 14 2023 10:21 PM | Last Updated on Sat, Apr 15 2023 10:05 AM

Harry Brook Said My Girlfriend Here But Rest Of the family just left  - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ హ్యారీ బ్రూక్‌ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.  ఈ సీజన్‌లో తొలి సెంచరీ బ్రూక్‌ దే. 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో వంద పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడినప్పటికి పేసర్ల బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ ఊచకోత కోశాడు. హ్యారీ బ్రూక్‌ ఇన్నింగ్స్‌ను చూసిన అతని గర్ల్‌ఫ్రెండ్‌ చప్పట్లతో అభినందించడం వైరల్‌గా మారింది.

ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ అనంతరం హ్యారీ బ్రూక్‌ మాట్లాడుతూ.. ''స్పిన్‌ ఆడడంలో కాస్త ఇబ్బందికి గురైన మాట వాస్తవమే. కానీ పవర్‌ప్లేను వీలైనంత మేర సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నా. ఆ తర్వాత మిడిల్‌ ఓవర్లలో స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ మార్క్రమ్‌, అభిషేక్‌ శర్మలకు సహకరించా. వాళ్లు ఔటైన తర్వాత ఆ బాధ్యతను నేను తీసుకున్నా. బాగా ఆడాలని మాత్రమే అనుకున్నా.. కానీ ఇలా సెంచరీ చేస్తానని ఊహించలేదు.

నా వంతు పాత్ర పోషించా.. ఇంకా మ్యాచ్‌ మిగిలే ఉంది. మా బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. నేను ఐపీఎల్‌ ఆడుతున్నానని తెలిసి ఫ్యామిలీ మొత్తం వచ్చింది. కొన్ని కారణాల రిత్యా వాళ్లు వెళ్లిపోయారు.. కానీ నా గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రం ఇక్కడే ఉంది. నా ఇన్నింగ్స్‌ను బాగా ఎంజాయ్‌ చేసింది. ఈరోజు నా ప్రదర్శనపై ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉందని భావిస్తున్నా'' అంటూ తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement