సాక్షి, హైదరాబాద్: సెయింట్‌జాన్స్ ఫ్రెండ్‌షిప్ కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆతిథ్య సెయింట్ జాన్స్ జట్టు విజేతగా నిలిచింది. శ్రీలంకకు చెందిన సీసీసీ స్కూల్ ఆఫ్ క్రికెట్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈమ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సెయింట్ జాన్స్ ‘ఎ’ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. సిద్ధార్థ్ (90) చెలరేగాడు. యశ్ (20) ఫర్వాలేదనిపించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రకాశ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం సీసీసీ స్కూల్ ఆఫ్ క్రికెట్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 113 పరుగులు చేసి పరాజయం పాలైంది. దిశాల్ (25), సహన్ (24) రాణించారు. సెయింట్ జాన్ బౌలర్లు ప్రియాన్షు, యశ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment