T20 Trophy: హైదరాబాద్‌పై ఆంధ్ర జట్టు గెలుపు | Senior Women T20 2022: Andhra Team Beat Hyderabad By 26 Runs | Sakshi
Sakshi News home page

Senior Women T20: అదరగొట్టిన అనూష.. హైదరాబాద్‌పై ఆంధ్ర జట్టు గెలుపు

Published Wed, Apr 20 2022 7:52 AM | Last Updated on Wed, Apr 20 2022 7:57 AM

Senior Women T20 2022: Andhra Team Beat Hyderabad By 26 Runs - Sakshi

Senior Women's T20 Trophy 2022- పుదుచ్చేరి: జాతీయ సీనియర్‌ మహిళల టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 26 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగుల స్కోరు చేసింది.

ఓపెనర్‌ ఎన్‌.అనూష (54 బంతుల్లో 61 నాటౌట్‌; 7 ఫోర్లు) రాణించింది. హైదరాబాద్‌ బౌలర్‌ జి.త్రిష రెండు వికెట్లు తీసింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరా బాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఓపెనర్‌ జి.త్రిష (56 బంతుల్లో 56 నాటౌట్‌; 6 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో శరణ్య గద్వాల్‌ (3/13), సీహెచ్‌ ఝాన్సీలక్ష్మి (2/24) హైదరాబాద్‌ను దెబ్బ తీశారు. 

చదవండి: IPL 2022: సెంచరీ మిస్‌.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement