T20 Trophy: హైదరాబాద్‌ శుభారంభం | Senior Women T20 Cricket Tournament: Hyderabad Beat Meghalaya By 64 Runs | Sakshi
Sakshi News home page

Women's T20 Trophy: హైదరాబాద్‌ శుభారంభం.. మేఘాలయను చిత్తు చేసి

Published Tue, Apr 19 2022 7:57 AM | Last Updated on Tue, Apr 19 2022 8:09 AM

Senior Women T20 Cricket Tournament: Hyderabad Beat Meghalaya By 64 Runs - Sakshi

T20 Cricket Tournament- పుదుచ్చేరి: జాతీయ సీనియర్‌ మహిళల టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్‌ ‘ఎ’ గ్రూప్‌లో భాగంగా సోమవారం మేఘాలయ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 64 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 143 పరుగులు చేసింది.

కెప్టెన్‌ రమ్య (44; 4 ఫోర్లు), కె.అనిత (34 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), జి.త్రిష (20 బంతుల్లో 26; 3 ఫోర్లు) రాణించారు. అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మేఘాలయ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి ఓడిపోయింది. హైదరాబాద్‌ బౌలర్లలో ప్రణవి చంద్ర, భోగి శ్రావణి, అనిత, వంకా పూజ ఒక్కో వికెట్‌ తీశారు.  

చదవండి: IPL 2022: బట్లర్‌ భళా... చహల్‌ చాంగుభళా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement