
రాజ్‌కోట్: కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ (44 బంతుల్లో 57; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో ఆకట్టుకున్నా... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. గత మ్యాచ్‌లో మేఘాలయ జట్టుపై ఘనవిజయం సాధించిన హైదరాబాద్... గ్రూప్ ‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగాల్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. టి20ల్లో వరుసగా మూడు శతకాలు బాది రికార్డుల్లోకెక్కిన తిలక్ వర్మ అదే ఫామ్ కొనసాగిస్తూ హాఫ్‌సెంచరీతో విజృంభించగా... రాహుల్ బుద్ధి (30; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించాడు.
తన్మయ్ అగర్వాల్ (6) రాహుల్ సింగ్ (10), మికిల్ జైస్వాల్ (12), రవితేజ (0), ప్రతీక్ రెడ్డి (3), సీవీ మిలింద్ (0) విఫలమయ్యారు. బెంగాల్ బౌలర్లలో మొహమ్మద్ షమీ 3... షహబాజ్, కరణ్ లాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బెంగాల్ జట్టు 17.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. అభిõÙక్ పొరెల్ (41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కరణ్‌లాల్ (46; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అనికేత్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. తదుపరి మ్యాచ్‌లో బుధవారం రాజస్తాన్‌తో హైదరాబాద్ తలపడనుంది.
బెంగాల్ చేతిలో హైదరాబాద్ ఓటమి
Comments
Please login to add a commentAdd a comment