Syed Mushtaq Ali domestic T20 cricket tournament
-
తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన హైదరాబాద్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఈ టోర్నీ గ్రూపు-ఏలో భాగంగా రాజస్తాన్ వేదికగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 119 పరుగులు మాత్రమే చేసింది. మేఘాలయ బ్యాటర్లలో లారీ సంగ్మా(46) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 3వికెట్లు పడగొట్టగా.. మిలాంద్, అంకిత్ రెడ్డి తలా వికెట్ సాధించారు. అదరగొట్టిన తన్మయ్, తిలక్ వర్మ.. అనంతరం 120 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. హైదరాబాద్ బ్యాటర్లలో తన్మయ్ అగర్వాల్(46 నాటౌట్), కెప్టెన్ తిలక్ వర్మ(31 బంతుత్లో 41 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. తిలక్ వర్మ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. తొలిసారి హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ సారథ్యం వహిస్తున్నాడు. కాగా తిలక్ వర్మ భారత సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: మిచెల్ స్టార్క్ క్రీడా స్పూర్తి.. రనౌట్ చేసే అవకాశమున్నా! వీడియో వైరల్ -
Asian Games: బీసీసీఐ కీలక నిర్ణయం! ఇక దేశవాళీ టీ20 టోర్నీలోనూ..
BCCI- Asian Games 2023: ముంబై: ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పాల్గొనడం ఖాయమైంది. శుక్రవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనికి అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. చైనాలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి. అయితే ఈ పోటీల్లో మహిళల విభాగంలో మాత్రమే భారత రెగ్యులర్, పూర్తి స్థాయి జట్టు బరిలోకి దిగుతోంది. పురుషుల విభాగంలో మాత్రం ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని బోర్డు నిర్ణయించింది. అక్టోబర్ 5 నుంచి భారత్‌లోనే వన్డే వరల్డ్ కప్ జరుగుతుండటమే దీనికి కారణం. అదే విధంగా.. ఐపీఎల్–2023 సీజన్లో కొత్తగా తీసుకొచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నాటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. చదవండి: బజ్‌బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
ఆంధ్రను గెలిపించిన స్టీఫెన్
వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు ఖాతా లో రెండో విజయం చేరింది. జార్ఖండ్ జట్టుతో శనివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. ఆంధ్ర బౌలర్లు చీపురపల్లి స్టీఫెన్ (3/23), హరిశంకర్ రెడ్డి (3/24) రాణించారు. 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసి ఓడిపో యింది. చివరి ఓవర్లో జార్ఖండ్ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఐదు వికెట్లున్నాయి. అయితే జార్ఖండ్ ఒక్క పరుగు మాత్రమే చేసి నాలుగు వికెట్లు (రెండు వికెట్లు స్టీఫెన్, రెండు రనౌట్లు) కోల్పోయింది. ఆఖరి ఓవర్ వేసిన ఆంధ్ర బౌలర్ స్టీఫెన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి జార్ఖండ్‌ను కట్టడి చేశాడు. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ నాలుగు క్యాచ్‌లు తీసుకోవడంతోపాటు ఒక రనౌట్‌లో పాలుపంచుకున్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. అశ్విన్ హెబ్బార్ (45; 6 ఫోర్లు), శ్రీకర్ భరత్ (48; 5 ఫోర్లు), రికీ భుయ్ (15 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు. -
ముంబై గెలుపు
కటక్: సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ముంబై కీలక విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలను మెరుగుపర్చుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. మహారాష్ట్ర 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం ముంబై 16.1 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్ ఆదిత్య తారే (39 బంతుల్లో 65 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడి జట్టును గెలిపించాడు.