BCCI Approves India Team's Participation For Men's And Women's In Asian Games - Sakshi
Sakshi News home page

బీసీసీఐ కీలక నిర్ణయం.. చైనాకు టీమిండియా! ఇక దేశవాళీ టీ20 టోర్నీలోనూ..

Published Sat, Jul 8 2023 7:25 AM | Last Updated on Sat, Jul 8 2023 8:57 AM

BCCI Approves India Mens Women Participation In Asian Games - Sakshi

BCCI- Asian Games 2023: ముంబై: ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్‌ జట్లు పాల్గొనడం ఖాయమైంది. శుక్రవారం జరిగిన బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో దీనికి అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. చైనాలో సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి.

అయితే ఈ పోటీల్లో మహిళల విభాగంలో మాత్రమే భారత రెగ్యులర్, పూర్తి స్థాయి జట్టు బరిలోకి దిగుతోంది. పురుషుల విభాగంలో మాత్రం ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని బోర్డు నిర్ణయించింది. అక్టోబర్‌ 5 నుంచి భారత్‌లోనే వన్డే వరల్డ్‌ కప్‌ జరుగుతుండటమే దీనికి కారణం.

అదే విధంగా.. ఐపీఎల్‌–2023 సీజన్‌లో కొత్తగా తీసుకొచ్చిన ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధనను దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలోనూ అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.  ఈ మేరకు శుక్రవారం నాటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.

చదవండి: బజ్‌బాల్‌ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement