t20 cricket match
-
RR Vs RCB Highlights Photos: ఆర్సీబీ కల చెదిరే.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ విక్టరీ (ఫొటోలు)
-
హడలెత్తించిన లక్నో పేస్ బౌలర్..సూపర్ జెయింట్స్ రెండో విజయం (ఫొటోలు)
-
IPL MI Vs GT Highlights Photos: ముంబయిపై గుజరాత్ గెలుపు (ఫొటోలు)
-
INDvsSA : రెండో టీ20లో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం (ఫొటోలు)
-
జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం నగరంలోని జింఖానా మైదానంలో టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా, మ్యాచ్ వీక్షేందుకు టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు అర్ధర్రాతి నుంచే క్యూ లైన్లలో బారులుతీరారు. పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా మైదానం వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో టికెట్స్ కోసం ఒక్కసారిగా ఎగబడటంతో గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో నలుగురు త్రీవంగా గాయపడ్డారు. పలువురు స్పృహ తప్పపడిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు సైతం గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పి ఉద్రికత్త చోటుచేసుకుంది. దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదిలా ఉండగా.. టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మ్యాచ్ టికెట్స్ విషయంలో బ్లాక్ టికెట్స్‌పై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. టికెట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సేల్ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్ కేటాయిస్తున్నారో చెప్పాలన్నారు. బ్లాక్ దందా కోసం మ్యాచ్ టికెట్స్ ఇవ్వలేదన్నారు. క్రికెట్ మ్యాచ్ టికెట్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీయొద్దన్నారు. బ్లాక్ దందా జరిగినట్లు తెలిస్తే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
T20 Trophy: హైదరాబాద్ శుభారంభం
T20 Cricket Tournament- పుదుచ్చేరి: జాతీయ సీనియర్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్ ‘ఎ’ గ్రూప్‌లో భాగంగా సోమవారం మేఘాలయ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 64 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ రమ్య (44; 4 ఫోర్లు), కె.అనిత (34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), జి.త్రిష (20 బంతుల్లో 26; 3 ఫోర్లు) రాణించారు. అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మేఘాలయ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో ప్రణవి చంద్ర, భోగి శ్రావణి, అనిత, వంకా పూజ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: IPL 2022: బట్లర్ భళా... చహల్ చాంగుభళా -
విజేత సీజేఐ ఎలెవెన్
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం టీ–20 క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించారు. మోడర్న్ స్కూల్ గ్రౌండ్లో సీజేఐ ఎలెవెన్, ఎస్బీఏ ఎలెవెన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సీజేఐ–ఎలెవన్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా సుప్రీం బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ప్రెసిడెంట్ వికాస్ సింగ్ వేసిన కొన్ని బంతులను సీజేఐ ఆడారు. సీజేఐ ఎలెవన్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎస్సీబీఏ ఎలెవెన్ జట్టు 12.4 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటైంది. -
కరీబియన్ల పై ప్రతీకారం తీర్చుకున్న సఫారీలు..
గ్రెనడా: వెస్టిండీస్ చేతిలో తొలి టీ20 ఓటమికి దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. గ్రెనడా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 16 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది. దీంతో ఐదు టీ20ల ఈ సిరీస్ ను దక్షిణాఫ్రికా ప్రస్తుతం 1-1తో సమం చేసింది. టాస్ ఓడి మెదట బ్యాటింగ్ చేసిన ఓపెనర్లు హెండ్రిక్స్, డికాక్ శుభారంభం ఇచ్చారు. ఓపెనర్ హెండ్రిక్స్ (42), కెప్టెన్ బవుమా (46) డికాక్(26) మెరుగైన స్కోర్లు నమోదు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో మెకాయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ రెండు, హోల్డర్, రసెల్ ఒక్కో వికెట్ తీశారు. ఆనంతరం 167 పరుగల లక్ష్యంతో బరి లోకి దిగిన వెస్టిండీస్ కు ఓపెనర్లు ఎవిన్ లావిస్ (21), ఫ్లెచర్ (35) శుభారంభం ఇచ్చినా.. మిడిలార్డర్లో క్రిస్‌గేల్ (8), నికోలస్ పూరన్ (9), కీరన్ పొలార్డ్ (1), ఆండ్రీ రసెల్ (5) తేలిపోయారు. మధ్యలో ఫ్యాబియన్ అలెన్ సిక్స్‌లు, ఫోర్లుతో కాసేపు సఫారీలను కంగారు పెట్టినా వరస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో కరీబియన్లకి 16 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా జట్టులో రబాడకి మూడు వికెట్లు దక్కగా.. లిండేకి రెండు, లుంగి ఎంగిడి, నార్జ్, షంషీకి ఒక్కో వికెట్ పడ్డాయి. ఈ మ్యాచ్ లో రెండు కీలక మైన వికెట్లు పడగొట్లిన జార్జ్ లిండే కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది చదవండి: India Tour Of Sri Lanka: శ్రీలంకకు బయల్దేరిన భారత జట్టు ఇదే! -
కొత్త రికార్డు; 4 ఓవర్లు, 3 మెయిడిన్లు
సూరత్: భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ టి20ల్లో చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేసి రికార్డులకు ఎక్కింది. టి20ల్లో మూడు మూడు మెయిడిన్ ఓవర్లు వేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా ఖ్యాతి దక్కించుకుంది. నాలుగు ఓవర్లు వేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించింది. తాను వేసిన 19 బంతికి మొదటి పరుగు ఇచ్చిదంటే ఆమె బౌలింగ్ ఎంత పదునుగా ఉందో తెలుస్తోంది. ఈ ఆగ్రా అమ్మాయి రెండు మేడిన్ ఓవర్లలో రెండు వికెట్లు తీయడం విశేషం. దీప్తి అద్భుత ప్రదర్శనకు తోడు ఇతర బౌలర్లు కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టుతో ప్రారంభమైన టి20 సిరీస్‌లో భారత మహిళల టీమ్ శుభారంభం చేసింది. తమ బౌలర్లు గొప్పగా రాణించడం వల్లే విజయం దక్కిందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. తమ వ్యూహానికి తగినట్టుగా బౌలింగ్ చేసి విజయాన్ని అందించారని ప్రశంసించింది. (చదవండి: దీప్తి సూపర్ బౌలింగ్) -
వీవీఐపీ గ్యాలరీలో చిట్‌ఫండ్ నిందితుడు
భువనేశ్వర్: చిట్‌ఫండ్ మోసాల్లో నిందితునిగా తెరపైకి వచ్చిన శుభంకర్ నాయక్ ఇటీవల కటక్ బారాబటి స్టేడియంలో ముగిసిన టీ–20 క్రికెట్ మ్యాచ్‌ను పురస్కరించుకుని ప్రత్యక్షమయ్యారు. మ్యాచ్‌ను తిలకించేందుకు విశిష్ట, అతిరథ, మహారథుల వర్గానికి కేటాయించిన గ్యాలరీలో ఆయన ప్రత్యక్షం కావడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. చిట్‌ఫండ్ మోసాల దర్యాప్తు, విచారణలో నిందిత శుభంకర్ నాయక్‌కు రాజకీయ, పాలన వగైరా రంగాల్లో అతిరథ మహారథులతో ప్రత్యక్ష లింకులు ఉన్నట్లు ఆరోపణ. కోర్టు మంజూరు చేసిన బెయిల్‌తో జైలు నుంచి వచ్చిన శుభంకర్ నాయక్ ఈ విశిష్ట వర్గాలతో చెలిమి యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తాజా సంఘటన స్పష్టం చేస్తోంది. మంత్రులు, సర్వోన్నత అధికారులు, క్రికెటర్ల కుటుంబీకులు ఇతరేతర వర్గాలకు కేటాయించి ఓసీఏ బాక్స్ గ్యాలరీలో శుభంకర్ నాయక్ కూడా ఆసీనులయ్యారు. ఈ సంఘటనపట్ల క్రికెట్ మ్యాచ్ నిర్వాహక వర్గం ఒడిశా క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. కోట్లాది రూపాయల మోసాల్లో నిందితుడు? శుభంకర్ నాయక్ పేరు గల వ్యక్తులకు బాక్స్ గ్యాలరీ టికెట్ జారీ కానట్లు ఈ సంస్థ వర్కింగ్ చైర్మన్ ధీరేన్ పొలై తెలిపారు. వేరొకరికి జారీ చేసిన టికెట్‌తో ఆయన ప్రవేశించి ఉంటారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్ మ్యాచ్ టికెట్లు బదిలీ చేసేందుకు వీలు కాని పరిస్థితుల్లో శుభంకర్ నాయక్‌ను బాక్స్ గ్యాలరీకి అనుమతించడంపై కూడా సందేహాల్ని రేకెత్తుతున్నాయి. టీ20 క్రికెట్మ్యాచ్ చిట్‌ఫండ్ మోసాల వ్యవహారాలను కొత్త మలుపు తిప్పింది. సీ–షోర్ గ్రూపు చిట్‌ఫండ్ కోట్లాది రూపాయల మోసాల్లో శుభంకర్ నాయక్ పాత్రధారిగా ఆరోపణ. రూ.2 లక్షల బాండు, సమాన విలువతో ఇద్దరు పూచీదార్ల హామీతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో శుభంకర్ నాయక్ ఈ ఏడాది ఆగస్టులో జైలు నుంచి విడుదలయ్యారు. 2014వ సంవత్సరం నవంబరు 18వ తేదీన సీ–షోర్ గ్రూపు చిట్‌ఫండ్ మోసాల వ్యవహారాల్లో నిందితునిగా ఆయనను సీబీఐ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. -
పట్టు కొనసాగిస్తే చాలు...
ఇండోర్: ప్రత్యర్థిపై పైచేయి ఎలాగూ ఉంది... ఓడితే సిరీస్ పోతుందేమోనన్న భయం లేదు... జట్టు అన్ని విభాగాల్లో సమతూకంతో పటిష్ఠంగా ఉంది... మిగిలిందల్లా మరో విజయంతో ముందడుగు వేయడమే...! శ్రీలంకతో శుక్రవారం ఇండోర్‌లో జరగనున్న రెండో టి20కి ముందు భారత జట్టు పరిస్థితిది. కటక్‌లో తొలి టి20లో సంపూర్ణ ఆధిపత్యం చాటి భారీ గెలుపును ఖాతాలో వేసుకున్న టీమిండియా అదే జోరును కొనసాగిస్తే తిరుగుండదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో ఇక్కడే ఒడిసిపట్టేయొచ్చు. ‘ఓపెనింగ్’ కుదిరింది... పెద్దగా మార్పులకు తావివ్వకుండానే తొలి 20లో భారత్ అదరగొట్టింది. కెప్టెన్ రోహిత్‌కు తోడుగా వచ్చిన కేఎల్ రాహుల్ అర్ధ శతకంతో పటిష్ట పునాది వేశాడు. తన ఇన్నింగ్స్‌లో దూకుడు, సంయమనం రెండింటినీ చూపాడు. దీంతో కీలకమైన రెండో ఓపెనర్ ఎవరనేది స్పష్టమైపోయింది. శుక్రవారం మ్యాచ్‌లోనూ వీరే ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. పరిస్థితికి తగ్గట్లు ఆడుతూ వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. ఎప్పటినుంచో చర్చకు తావిస్తున్న ‘నాలుగో స్థానం’లో వచ్చిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన విలువేంటో చాటాడు. అతడికి మనీశ్‌పాండే తోడవడంతో కటక్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇండోర్‌లోనూ ఇదే ఆర్డర్‌ను కొనసాగించవచ్చు. ఓవర్లు మరీ తక్కువగా ఉండి... భారీ హిట్టింగ్ చేయాల్సి వస్తే హార్దిక్ పాండ్యాను ముందుగా పంపే ఆలోచన చేయొచ్చు. స్పిన్ ద్వయం చహల్, కుల్దీప్ అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రత్యర్థి ఎదురుదాడికి దిగినా వెరవకుండా బౌలింగ్ చేస్తున్నారు. వీరిని ఎదుర్కొనే సంగతి అటుంచి కనీసం వికెట్ కాపాడుకోవడమూ లంక ఆటగాళ్లకు సాధ్యం కావడం లేదు. తొలి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసినా ఆటగాళ్లందరినీ పరీక్షించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తే ఉనాద్కట్ స్థానంలో బాసిల్ థంపి అరంగేట్రం చేయొచ్చు. లంక... లుకలుక.. శ్రీలంక ఆటతీరు కటక్‌లో మరీ తీసికట్టుగా సాగింది. ఏ విభాగంలోనూ భారత్‌కు సమ ఉజ్జీగా నిలవలేకపోయింది. ఓపెనింగ్‌లో డిక్వెలా, తరంగ ఫర్వాలేదనుకున్నా... తర్వాత నడిపించేవారు కనిపించడం లేదు. సీనియర్ మాథ్యూస్ బంతితో ఆకట్టుకుని బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ధాటిగా ఆడాల్సిన వన్‌డౌన్‌కు కుషాల్ పెరీరా న్యాయం చేయలేకపోయాడు. గుణరత్నే, కెప్టెన్ తిసారా పెరీరా పేరుకు మాత్రమే అన్నట్లున్నారు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ షనకను కెప్టెన్ కంటే ముందు పంపినా ఫలితం లేకపోయింది. అతడిని బౌలింగ్‌లోనూ ఉపయోగించుకోలేదు. తొలి మ్యాచ్‌లో మాథ్యూస్, అకిల ధనంజయ మినహా.. మిగతా వారి బౌలింగ్‌ను భారత్ బ్యాట్స్‌మెన్ అలవోకగా ఎదుర్కొన్నారు. చమీర, నువాన్ ప్రదీప్ 17, 19 ఓవర్లలో ఏకంగా 40 పరుగులివ్వడం మ్యాచ్ గతినే మార్చేసింది. ఇండోర్‌లో లంక కూడా ఒక మార్పుతో దిగనున్నట్లు తెలుస్తోంది. లెఫ్టార్మ్ పేసర్ విశ్వ ఫెర్నాండో స్థానంలో బ్యాట్స్‌మన్ సమరవిక్రమను తుది జట్టులోకి తీసుకోనున్నారు. జట్టుగా ఆడటంతో పాటు ఒకట్రెండు అత్యుత్తమ ప్రదర్శనలు చేస్తేనే లంక భారత్‌ను ఓడించగలదు. పిచ్, వాతావరణం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం బ్యాట్స్‌మన్ స్వర్గధామంగా పేరుగాంచింది. ఇక్కడ బౌండరీ పరిధి కూడా తక్కువే. మధ్య భారత్‌లోని వేదిక కాబట్టి మంచు ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వాతావరణ పరిస్థితుల రీత్యా వర్షం కురిసే అవకాశాలు తక్కువే. జట్లు (అంచనా) భారత్: రోహిత్‌శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోని, శ్రేయస్ అయ్యర్, మనీశ్‌పాండే, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, బాసిల్ థంపి శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), డిక్వెలా, తరంగ, మాథ్యూస్, కుషాల్ పెరీరా, సమరవిక్రమ, గుణరత్నే, షనక, అకిల ధనంజయ, చమీర, ప్రదీప్ -
వారెవ్వా.. వాటే సెన్సేషనల్ క్యాచ్..!
-
ఛేజింగ్ స్టార్... సగటు సూపర్!
మొహాలి: సవాలుకు సిసలైన సవాల్ విరాట్ కోహ్లి. కిష్లపరిస్థితుల్లో అతడి బ్యాట్ మరింత పదుకెక్కుతుంది. టీ20 వరల్డ్ కప్ లో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ విహారంతో టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖాయం చేశాడు. 'ఛేజింగ్ స్టార్'గా తనకు ఇచ్చిన బిరుదుకు సార్థకత చేకూర్చాడు. ఛేదనలో తిరుగులేని క్రికెటర్ గా మరోసారి వ్రూవ్ చేసుకున్నాడు. సెకండ్ బ్యాటింగ్ లో రికార్డును మెరుగు పరుచుకున్నాడు. ఛేజింగ్ లో అతడి సగటు సెంచరీకి చేరువగా ఉండడమే ఇందుకు నిదర్శనం. టీ20ల్లో ఇప్పటివరకు 19 మ్యాచుల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లి 91.8 యావరేజ్ తో 918 పరుగులు సాధించాడు. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ ఒక్కడే అతడి కంటే ముందున్నాడు. మెక్ కల్లమ్ 38 మ్యాచుల్లో 1,006 పరుగులు చేశాడు. విజయవంతమైన ఛేదనల్లో కోహ్లి బ్యాటింగ్ సగటు సెంచరీ దాటేసింది. 15 ఇన్నింగ్స్ లో 122.83 సగటుతో 737 పరుగులు బాదాడు. ఇందులో 8 అర్ధసెంచరీలు ఉన్నాయి. 12సార్లు అతడి హాఫ్ సెంచరీలతోనే టీమిండియా విజయం సాధించింది. ఇప్పటివరకు 42 టీ20 మ్యాచ్ లు ఆడిన కోహ్లి 55.42 సగటుతో 1552 పరుగులు చేశారు. టీ20ల్లో 15 హాఫ్ సెంచరీలు చేసిన క్రిస్ గేల్, మెక్ కల్లమ్ సరసన కోహ్లి నిలిచాడు. కాగా, విరాట్బలి.. ఆస్ట్రేలియా బలి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పెట్టిన కోహ్లి ఫొటో హల్ చల్ చేస్తోంది.