సవాలుకు సిసలైన సవాల్ విరాట్ కోహ్లి. కిష్లపరిస్థితుల్లో అతడి బ్యాట్ మరింత పదుకెక్కుతుంది.
మొహాలి: సవాలుకు సిసలైన సవాల్ విరాట్ కోహ్లి. కిష్లపరిస్థితుల్లో అతడి బ్యాట్ మరింత పదుకెక్కుతుంది. టీ20 వరల్డ్ కప్ లో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ విహారంతో టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖాయం చేశాడు. 'ఛేజింగ్ స్టార్'గా తనకు ఇచ్చిన బిరుదుకు సార్థకత చేకూర్చాడు. ఛేదనలో తిరుగులేని క్రికెటర్ గా మరోసారి వ్రూవ్ చేసుకున్నాడు. సెకండ్ బ్యాటింగ్ లో రికార్డును మెరుగు పరుచుకున్నాడు. ఛేజింగ్ లో అతడి సగటు సెంచరీకి చేరువగా ఉండడమే ఇందుకు నిదర్శనం.
టీ20ల్లో ఇప్పటివరకు 19 మ్యాచుల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లి 91.8 యావరేజ్ తో 918 పరుగులు సాధించాడు. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ ఒక్కడే అతడి కంటే ముందున్నాడు. మెక్ కల్లమ్ 38 మ్యాచుల్లో 1,006 పరుగులు చేశాడు. విజయవంతమైన ఛేదనల్లో కోహ్లి బ్యాటింగ్ సగటు సెంచరీ దాటేసింది. 15 ఇన్నింగ్స్ లో 122.83 సగటుతో 737 పరుగులు బాదాడు. ఇందులో 8 అర్ధసెంచరీలు ఉన్నాయి. 12సార్లు అతడి హాఫ్ సెంచరీలతోనే టీమిండియా విజయం సాధించింది.
ఇప్పటివరకు 42 టీ20 మ్యాచ్ లు ఆడిన కోహ్లి 55.42 సగటుతో 1552 పరుగులు చేశారు. టీ20ల్లో 15 హాఫ్ సెంచరీలు చేసిన క్రిస్ గేల్, మెక్ కల్లమ్ సరసన కోహ్లి నిలిచాడు. కాగా, విరాట్బలి.. ఆస్ట్రేలియా బలి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పెట్టిన కోహ్లి ఫొటో హల్ చల్ చేస్తోంది.