ICC T20 World Cup 2016
-
భారత్-ఆసీస్ మ్యాచ్ హైలైట్స్
మొహాలి: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పలు విశేషాలు చోటుచేసుకున్నాయి. ఈ మ్యాచ్ లో విరోచిత ఇన్నింగ్స్ తో అదరగొట్టిన టీమిండియా స్టార్ బాట్స్ మన్ విరాట్ కోహ్లి తన బ్యాటింగ్ గణాంకాలు మరింత మెరుచుపరుచుకున్నాడు. కంగారు టీమ్ పై ధోని సేన తన రికార్డును మరింత పటిష్టం చేసుకుంది. * విరాట్ కోహ్లి 82 పరుగులతో నాటౌట్ గా నిలిచి టీ20ల్లో రెండో వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు సాధించాడు. అతడి వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 90 నాటౌట్. 2016, జనవరి 16న ఆస్ట్రేలియాపైనే నమోదు చేశాడు. * టీ20ల్లో విజయవంతమైన ఛేజింగ్స్ లో భారత్ బ్యాట్స్ మన్ చేసిన అత్యధిక స్కోరు కోహ్లిదే కావడం విశేషం. 2012, సెప్టెంబర్ లో కొలంబొలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లి 61 బంతుల్లో 78 పరుగులు చేశాడు. తాజాగా దీన్ని అధిగమించాడు. * అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ రికార్డును కోహ్లి సమం చేశాడు. 15 సార్లు అతడీ ఘనత సాధించాడు. క్రిస్ గేల్(రెండు సెంచీలు, 13 అర్ధసెంచరీలు), బ్రెండన్ మెక్ కల్లమ్(రెండు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు) సరసన నిలిచాడు. * 12సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ తో కోహ్లి టీమిండియా విజయం సాధించిపెట్టాడు. ఈ విషయంలోనూ మెక్ కల్లమ్ తో సమానంగా నిలిచాడు. * విరాట్ కోహ్లి 9 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(ఎంఓఎం) అవార్డు అందుకున్నాడు. షాహిద్ ఆఫ్రిది(11) మాత్రమే అతడి కంటే ముందున్నాడు. * ఆస్ట్రేలియాతో జరిగిన 9 మ్యాచుల్లో కోహ్లి మూడుసార్లు మ్యాన్ ది మ్యాచ్(ఎంఓఎం) దక్కించుకున్నాడు. ఈ విషయంలో క్రిస్ గేల్, ఉమర్ అక్మల్, యువరాజ్ సింగ్ ను వెనక్కునెట్టాడు. వీరు ముగ్గురు ఆసీస్ పై రెండేసిసార్లు ఎంఓఎంగా ఎంపికయ్యారు. టీ20ల్లో ఒక కేలండర్ ఇయర్ లో ఆరుసార్లు ఎంఓఎం అందుకుని ఎవరూ సాధించని ఘనత సాధించాడు. 2012లో షేన్ వాట్సన్ ఐదుసార్లు ఎంఓఎం సాధించాడు. * ఆస్ట్రేలియాతో ఆడిన 13 టీ20ల్లో టీమిండియా 9 సార్లు విజయం సాధించగా, నాలుగింటిలో ఆసీస్ గెలిచింది. కంగారూ టీమ్ పై ధోనిసేన సక్సెస్ రేటు 69.23 శాతంగా ఉంది. మరేదేశంపైనా ఇంత సక్సెస్ రేటు లేదు. * టీ20 మ్యాచుల్లో ఆస్ట్రేలియా 9 సార్లు మరేయితర జట్టుచేతిలో ఓడిపోలేదు. ఆసీస్ ను 9 సార్లు ఓడించిన ఘనత టీమిండియాకే దక్కింది. * 2013, అక్టోబర్ 10- 2016 మార్చి 27 మధ్యలో వరుసగా ఆరు మ్యాచుల్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించింది. అంతకుముందు ఇంగ్లండ్ పేరిట ఈ రికార్డును ధోని సేన సమం చేసింది. 2008, ఫిబ్రవరి 5-2013, ఫిబ్రవరి 9 మధ్యలో న్యూజిలాండ్ పై ఇంగ్లీషు టీమ్ వరుసగా ఆరు విజయాలు నమోదు చేసింది. -
ఛేజింగ్ స్టార్... సగటు సూపర్!
మొహాలి: సవాలుకు సిసలైన సవాల్ విరాట్ కోహ్లి. కిష్లపరిస్థితుల్లో అతడి బ్యాట్ మరింత పదుకెక్కుతుంది. టీ20 వరల్డ్ కప్ లో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ విహారంతో టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖాయం చేశాడు. 'ఛేజింగ్ స్టార్'గా తనకు ఇచ్చిన బిరుదుకు సార్థకత చేకూర్చాడు. ఛేదనలో తిరుగులేని క్రికెటర్ గా మరోసారి వ్రూవ్ చేసుకున్నాడు. సెకండ్ బ్యాటింగ్ లో రికార్డును మెరుగు పరుచుకున్నాడు. ఛేజింగ్ లో అతడి సగటు సెంచరీకి చేరువగా ఉండడమే ఇందుకు నిదర్శనం. టీ20ల్లో ఇప్పటివరకు 19 మ్యాచుల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లి 91.8 యావరేజ్ తో 918 పరుగులు సాధించాడు. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ ఒక్కడే అతడి కంటే ముందున్నాడు. మెక్ కల్లమ్ 38 మ్యాచుల్లో 1,006 పరుగులు చేశాడు. విజయవంతమైన ఛేదనల్లో కోహ్లి బ్యాటింగ్ సగటు సెంచరీ దాటేసింది. 15 ఇన్నింగ్స్ లో 122.83 సగటుతో 737 పరుగులు బాదాడు. ఇందులో 8 అర్ధసెంచరీలు ఉన్నాయి. 12సార్లు అతడి హాఫ్ సెంచరీలతోనే టీమిండియా విజయం సాధించింది. ఇప్పటివరకు 42 టీ20 మ్యాచ్ లు ఆడిన కోహ్లి 55.42 సగటుతో 1552 పరుగులు చేశారు. టీ20ల్లో 15 హాఫ్ సెంచరీలు చేసిన క్రిస్ గేల్, మెక్ కల్లమ్ సరసన కోహ్లి నిలిచాడు. కాగా, విరాట్బలి.. ఆస్ట్రేలియా బలి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పెట్టిన కోహ్లి ఫొటో హల్ చల్ చేస్తోంది. -
కోహ్లి గురించి మాల్యా ఏమన్నారంటే...
లండన్: మాస్టర్ ఇన్నింగ్స్ తో టీమిండియాకు విజయాన్ని అందించిన స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లికి ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా అభినందలు తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ను విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ సమరంగా వర్ణించారు. టీ20 వరల్డ్ కప్ లో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిసిన తర్వాత తన అభిప్రాయాలను ట్విటర్ లో పోస్ట్ చేశారు. 'అండర్-19 ఆటగాడిని ఉన్న కోహ్లిని ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టులోకి తీసుకున్నప్పుడు మాకు తెలియలేదు... మేము తీసుకున్నది ప్రపంచలోనే బెస్ట్ బ్యాట్స్ మన్ ని అని. కంగ్రాట్స్. ముంబైలో జరగనున్న సెమీఫైనల్ లో ఇద్దరు యోధులు గేల్, కోహ్లి హోరాహోరీగా తలపడనున్నారు. రెండు టీమ్ లకు నా శుభాకాంక్షలు. ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడుతున్న విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, భారత విధ్వంసక బ్యాట్స్ మన్ రానున్న సీజన్ లో సత్తా చాటాల'ని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు. ఆదివారం నాగపూర్ లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ను ఉత్కంఠతో వీక్షించానని వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆర్సీబీ తరపున ఐపీఎల్ లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. When I picked Virat as a U-19 player @imVkohli for RCB @RCBTweets I didn't realise I was picking the best batsman in the World. Congrats. — Vijay Mallya (@TheVijayMallya) 27 March 2016 Now it's a contest between two RCB @RCBTweets stalwarts Virat @imVkohli and Chris Gayle @henrygayle in Mumbai. Good luck to both mates. — Vijay Mallya (@TheVijayMallya) 27 March 2016